రానున్న ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుని సరైన నాయకుడిని ఎన్నుకోవాలని రామగుండం బీజేపీ ఇన్చార్జ్ కందుల సంధ్యారాణి పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా NTPCలో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఔర్ ఏక్ బార్ మోదీ సర్కార్ నినాదంతో బీజేపీ రానున్న వందేళ్ళ అభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు. పదేళ్ల మోదీ పాలనలో భారత్ అగ్రరాజ్యాలతో పోటీ పడిందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని, రానున్న ఎన్నికల్లో మోదీకి పట్టం కట్టాలని కోరారు. గల్లీలో ఎవరు ఉన్నా ఢిల్లీలో మోదీ రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు సంధ్యారాణి తెలిపారు. మోడీ నాయకత్వంలో పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌ను అధిక మెజారిటీతో గెలిపిం చాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు.


