కూటమి అభ్యర్థి సుజనా చౌదరిపై విజయవాడ వైసీపీ అభ్యర్థి కేశినేని నాని తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన సుజనా చౌదరి అన్ని అబద్దాలు మాట్లాడు తున్నారని, ఆయన చెప్పే మాటలను ప్రజలేవరు వినడానికి సిద్ధంగా లేరన్నారు. తన బ్యాంకు స్కాం గురించి ప్రజలందరికి తెలుసన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకి కానీ, విజయవాడ వెస్ట్‌కు కానీ ఏమైనా అభివృద్ది చేశావా అంటూ ప్రశ్నించారు. విజయవాడ వెస్ట్‌ను బెస్ట్ చేస్తా అని మాట్లాడితున్నావ్ బ్యాంకు లను మోసం చేసినట్టు విజయవాడ ప్రజలను మోసం చేద్దామని చూస్తున్నావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా విజయవాడ ప్రజలు ఓటుతో బుద్ది చెబుతారని హెచ్చరించారు.


