24.1 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

ఫస్ట్ నైట్ రోజు…పెళ్లికొడుకు గావు కేక

కంగారు పడకండి…అక్కడేం జరగలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి…శోభనం గదిలోకి వెళ్లిన తర్వాత…పెళ్లి కొడుకు గావు కేక పెట్టి బయటకు పరుగులు తీశాడు. అలా పరుగెత్తి పరుగెత్తి సరాసరి పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు. అక్కడ కంప్లయింట్ చేసి, నన్ను మోసం చేసి పెళ్లిచేసుకుందని రాసిచ్చాడు. అయితే అది చూసి స్టేషన్ లో పోలీసులు ఒకటే నవ్వులు, దాంతో అతనికేం చేయాలో తెలియక కోర్టు మెట్లు ఎక్కడానికి సిద్ధమవుతున్నాడు.

ఇంతకీ విషయం ఏమిటంటే…హర్యానా రాష్ట్రంలో దుర్గాపూర్ కి చెందిన శుక్లాల్  అనే యువకుడున్నాడు…సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అన్నమాట. నిరంతరం అందులోనే మునిగి తేలుతుంటాడు. అయితే సోషల్ మీడియాలో మోసాలకు సంబంధించి చాలా వార్తలు చదువుతుంటాడు. కానీ తనే ఎలా బుట్టలో పడ్డాడన్నది తనకే అంతుచిక్కకుండా ఉంది. వివరాల్లోకి వెళితే…

సోషల్ మీడియాలో బ్రౌజింగ్ చేస్తుండగా ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. ఇద్దరివి మాటా మాటా కలిశాయి. ఆ పరిచయమైన కొన్నిరోజులకి…అది ప్రేమగా చిగురించింది. తర్వాత మొగ్గ తొడిగింది. తర్వాత మరికొన్ని రోజులకి ముదిరి పాకాన పడింది. ఇంకేం ఉంది? పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అన్నీ స్పీడ్ స్పీడ్ గా జరిగిపోయాయి. ఇక తర్వాత జరిగే శోభనం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాడు. ఆ శుభ ఘడియలు రానే వచ్చాయి.

పెళ్లికొడుకు-పెళ్లి కూతుర్ని శోభనం గదిలోకి పంపించి తలుపులేశారు. ముత్తయిదువల నవ్వులతో ఆ ప్రాంతమంతా పువ్వులు పూస్తున్నాయి. వెళ్లిన గంట తర్వాత అసలు విషయం గ్రహించిన పెళ్లికొడుకు పెద్దపెద్దగా కేకలు పెడుతూ శోభనం గదిలోంచి బయటకి వచ్చాడు. అర్జంటుగా పోలీస్ స్టేషన్ కి ఆ శోభనం బట్టలతోనే పరుగులు తీశాడు. ఇంతకీ విషయం ఏమిటంటే,

తను సోషల్ మీడియాలో ఛాటింగ్ చేసి ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి…

ఒక ట్రాన్స్ జెండర్…

విషయం తెలిసిన చాలామంది పెళ్లికొడుకులాగే ఘొల్లుమన్నారు. కొందరు ముక్కున వేలేసుకున్నారు.కొందరు కిసుక్కున నవ్వారు. కొందరు సోషల్ మీడియా పిచ్చివాళ్లకి ఇలాగే జరగాలని శపించారు. కొందరు ఆడిపోసుకున్నారు. కొందరు ఇవన్నీ పోయేకాలం రోజులు అనుకుంటూ తిట్టుకున్నారు.

మొత్తానికి పెళ్లికొడుకు గొడవ చేస్తుంటే…ఇంతకీ ట్రాన్స్ జెండర్ పెళ్లి కూతురు చావు కబురు ఒకటి చల్లగా చెప్పింది. నువ్వు వద్దంటే వెళ్లిపోతాను. కానీ నాకు భరణం కావాలి. లేదా ఆస్తిలో వాటా కావాలని పట్టుపట్టడంతో పెళ్లికొడుకు ఇంకా జుట్టు పీక్కుంటున్నాడంట. ఇదండీ పరిస్థితి…సోషల్ మీడియా మాయలో పడకండి… తస్మాత్ జాగ్రత్త…

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్