నామినేషన్ దాఖలు
ఏలూరు జిల్లా కైకలూరు బీజేపీ అభ్యర్థిగా కామినేని శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమం సందర్భంగా కైకలూరు పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. నిర్వహణ కూటమి నేతలతో కలిసి కైకలూరు తాసిల్దార్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
విజ్ఞప్తి
ఖమ్మం జిల్లా కొణిజర్లలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు పర్యటించారు. మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. దేశంలో రాబోయే తరాలు సురక్షితంగా ఉండాలంటే, యువతకు ఉద్యోగాలు రావాలంటే కేంద్రంలో మరోసారి నరేంద్ర మోడీ పరిపాలన రావాలన్నారు. తనను గెలిపిస్తే ఖమ్మం అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు.
కి”లేడీలు
అల్లూరి జిల్లా చింతూరులో ముగ్గురు కిలాడి లేడీలు పట్టపగలే నీలిమ జువెలరీ షాపులో చోరీకి పాల్ప డ్డారు. కస్టమర్ లాగా వచ్చిన ఈ మహిళలు రోల్డ్ గోల్డ్ చెవిదిద్దులు అక్కడ పెట్టి 50,000 విలువచేసే బంగారు చెవి దిద్దులను ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని గుర్తించిన షాపు యజమాని అవాక్కయింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మహిళల గురించి ఆరా తీస్తున్నారు.
ఘోర ప్రమాదం
హైదరాబాద్ ఉప్పల్ చెరువు కట్టపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడి కక్కడే మృతి చెందాడు. యువకుడి బైక్ స్కిడ్ అయి రోడ్డుపై పడిపోగా వెనుక నుండి వస్తున్న ఆర్టీసీ బస్సు యువకుడి తలపై నుండి వెళ్లడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
ఇసుక మాఫీయా
ఏటూరు నాగారం ఏజెన్సీలో ఇసుక మాఫీయా రెచ్చిపోతోంది. TSMDC Online DD తీసుకువెల్లినా 3వేల 500 చెల్లించినా… కాంట్రాక్టర్ లోడింగ్ చేయడం లేదని డ్రైవర్‌లు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. TSMDC అధికారుల దృష్టిలో పెట్టి చర్యలు తీసుకోకపోవడం పై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చైన్‌స్నాచర్లు
ఉప్పల్‌లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. గోకులేనగర్‌లో ఇంటి ముందు ఊడ్చుతున్న యాదమ్మ అనే వృద్ధురాలు మెడలో నుంచి నాలుగు తులాల బంగారు గొలుసును ఎత్తుకెల్లారు. దీంతో దొంగను వెంటాడి పట్టుకుని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు.
వడదెబ్బకు మృతి
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామానికి చెందిన ఓ తాపీ మేస్త్రి వడదెబ్బతో అస్వస్థతకు గురై మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.బుగ్గపాడు గ్రామానికి చెందిన చిన్నబోయిన వెంకన్న తాపీ మేస్త్రి గా జీవనాన్ని కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
కళ్యాణ వైభోగం…
ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోప్తంగా కమనీయంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం నందు ఆలయ కమిటీ చైర్మన్ పెనుగొండ కేశవరావు ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఇంటింటా ప్రచారం
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటి కి తిరిగి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిం చాలని పిలుపునిచ్చారు.
శోభాయాత్ర
సికింద్రాబాద్ లిటిల్ సార్ ఫ్రెండ్స్ అసోసియేషన్ హనుమాన్ శోభాయాత్ర జరిగింది. లిటిల్ స్టార్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శోభాయాత్ర స్వాగత వేదిక గత 15 ఏండ్ల నిర్వహిస్తున్నటు వంటి స్వాగత వేదికకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు అధ్యక్షుడు కొంగరి సతీష్.
ఆత్మహత్య
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంకు చెందిన కోమలిక పురుగుల మందు తాగి ఆత్మ హత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సబ్యులు మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోమలిక మృతి చెందింది. విషయం తెలియగానే ఆసుపత్రి నుండి భర్త, మామలు పరారయ్యారు.


