హైదరాబాద్ అంజయ్యనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. నీటి సంపులో పడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందడం తో స్థానికంగా విషాదం అలముకుంది. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజిలో రికార్డయ్యాయి. హాస్టల్ గేటు తెరిచి లోపలికి వస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. తెరిచి ఉన్న సంపును గమనించలేదు. లోపలికి వెళ్లే క్రమంలో సంపులో అడుగుపడడంతో అందులో పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో సంపులోనే మృతి చెందాడు.సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతికి హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని స్పష్టంగా తెలుస్తోంది. తిరిగే చోట మధ్యలో ఉన్న సంపును నిర్లక్ష్యంగా తెరిచి ఉంచడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా స్పష్టమవుతోంది. తెరిచిన సంపును వెంటనే మూసివేయాల్సి ఉండగా.. అలా వదిలేసి ఉండడంతోనే ఓ నిండు ప్రాణం పోయింది. సంపుపై మూతపెట్టకుండా నిర్లక్ష్యం గా వ్యవహరించిన హాస్టల్ యజమానిపై కేసు నమోదు చేశారు పోలీసులు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతిపై దర్యాప్తు చేస్తున్నారు.


