గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు. ఏటుకూరు నుండి ప్రతిపాడు వరకు ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రత్తిపాడు రిటర్నింగ్ ఆఫీసర్ కు ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు. ప్రతిపాడు నియోజకవర్గంలో ఎక్కువ శాతం వ్యవసాయాన్నే జీవనోపాధిగా ఆధారపడి ఉన్నారని.. ఈ ప్రాంతానికి తాగునీరు సాగునీరు రహదా రులు మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని కచ్చితంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం నామినేషన్ దాఖలు చేశారు. మస్తాన వలి దర్గాలో పూజలు చేసిన జయరాం పార్టీ కార్యకర్తలతో పాత గుంతకల్లు నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన వేసే రోజున నియోజకవర్గ కార్యకర్తలు, పట్టణ ప్రజలు తనకు బ్రహ్మరథం పట్టారని, ఎన్నికల్లో తన విజయం తథ్యమని టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం అన్నారు.
సంక్షేమ పదకాలు చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని మండిపడ్డారు మేకతోటి సుచరిత. గుంటూరు..తాడికొండ ఆర్వో కార్యాలయంలో ఆమె నామినేషన్ దాఖలు చేశారు. అత్యధిక మెజార్టీతో గుంటూరు పార్లమెంట్ సీటును గెలుస్తామని సుచరిత చెప్పారు. కులం, మతం తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించామని.. రానున్న ఎన్నికల్లో ప్రజలు తమని గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
పల్నాడు జిల్లా పెదకూరపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నంబూరు శంకర్రావు నామినేషన్ దాఖలు చేశారు. జగన్ ప్రవేశ పెట్టిన పథకాలు, రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రజలు మరోసారి తమను ఆదరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో అభివృద్ధి చేస్తామని ఎన్నికలకు వెళ్లామని..ఇప్పుడు అభి వృద్ధి చేసి చూపించి వెళ్తున్నామని శంకర్రావు తెలిపారు.


