సుగంధ ద్రవ్యాలలో ఒక్కొక్క దినుసుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి వాటిలో ఒకటి గసగసాలు. దీని నుంచి తయారయ్యే నల్లమందును ఆయుర్వేద, హూమియో, అల్లోపతి ఔషధాల తయారీలో వినియోగిస్తారు. దగ్గుమందు, పెయిన్ కిల్లర్స్ తయారీలో దీనిని వాడతారు. అయితే, నల్లమందు, ఓపియం మార్ఫిన్ ఉత్పత్తి ని రాజస్థాన్ ముఠా క్యాష్ చేసుకుంటోంది. ఈ ముఠా గుట్టును ఎక్సైజ్ శాఖ అధికారులు రట్టు చేశారు.
హైదరాబాద్ మహా నగరంలో నల్లమందు సరఫరా చేయడానికి కొన్ని ముఠాలు రెడీ అయ్యాయి. అయితే, పక్కా సమాచారం అందుకున్న హైదరాబాద్ ఎక్సైజ్ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ ముఠా గుట్టు రట్టు చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గత 15 రోజులుగా రాజస్థాన్ నుంచి హైదరాబాద్ నగరానికి నల్లమందు సరఫరా అవుతోందని హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్ తెలిపారు. నారాయణ గూడ దూల్ పేట్ ప్రాంతంలో 160 కిలోల నల్లమందును సీజ్ చేసి, ఇద్దరిని అరెస్ట్ చేశామని ఆయన చెప్పారు. నిందితులు తేజరామ్, దేవేంద్ర కస్ ఈ దందా సాగిస్తున్నట్టు ఆయన చెప్పారు. రాజస్థాన్ లో మెయిన్ కింగ్ పిన్ పరాస్ ద్వారా నల్లమందు హైదరాబాద్ కు చేరుతోందని ఆయన తెలిపారు. గ్రాము నల్లమందును వెయ్యి రూపాయలకు, కిలో లక్షా 20 వేల రూపాయలకు విక్రయిస్తున్నారుని తెలిపారు. సుమారు కోటి 50 లక్షల రూపాయలు విలువ చేసే 160 కిలోల నల్లమందును సీజ్ చేశామని చెప్పారు.
ఆరోగ్యమే మహాభాగ్యం. పోపులపెట్టెలోని సుగంధ ద్రవ్యాలు ఆరోగ్యకారకాలు. ఈ ఆరోగ్యకారక సుగంధ ద్రవ్యాల నుంచి నిందితులు నిషేధిత డ్రగ్స్ తయారు చేసి, యువతను మత్తుకు బానిసలు చేస్తున్నారు. అనారోగ్యానికి గురి చేస్తున్నారు. నేరగాళ్లు, గసగసాల పంట పండించి దీని ద్వారా హెరాయిన్, మార్పిన్ డ్రగ్స్ తయారు చేస్తున్నారు. నల్లమందు ద్వారా 0.32 మిల్లి గ్రాముల హెరాయిన్, మార్పిన్ తయారు చేస్తున్నారు. హాఫ్ గ్రామ్ మఫ్రీన్ టీ, కాఫీల్లో వేసుకుంటే చాలు.. గమ్మత్తుగా మత్తు వచ్చేస్తుంది. ఔషధాల తయారీలో నల్లమందును ఎంతో పగడ్బంధీగా, ప్రమాణాలు పాటిస్తూ వినియోగిస్తారు. ఆయుర్వేదం, హోమియో, అల్లోపతి మందుల్లో దీనిని పాళ్ల ప్రకారం వాడతారు. దగ్గు మందులు, పెయిన్ కిల్లర్స్ తయారీలో దీనిని ఉపయోగిస్తారు. ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు వాడే ఔషధాల్లో దీనిని అధికంగా వినియోగిస్తారు. నల్లమందు నేరుగా మనిషి నాడీ వ్యవస్థపై పనిచేస్తుంది. శారీరక శ్రమ చేసి అలసిపో యిన శ్రామికులకు, తీవ్ర బాధల ఉపశమనానికి ప్రమాణాలు పాటిస్తూ కొన్ని ఔషధాల్లో వాడే నల్లమందును కొకైన్, హెరాయిన్ తదితర ప్రమాదకర మాదక ద్రవ్యాల్లో వినియోగించి, ఎందరో అమాయకులను దీనికి బానిసలుగా మారుస్తున్నారు. దీనికి బానిసైన ఎందరో జీవచ్ఛవాలుగా మారుతున్నారు. మరెందరో మృత్యువాత పడుతున్నారు.
నల్లమందు, మత్తు పదార్దాల తయారీకి మూలకారకమైన గసగసాల సాగుపై ప్రభుత్వం నిషేధం విధించింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ సాగుకు అనుమతి ఉంది. ఈ పంట సాగు చేయాలంటే కేంద్ర అనుమతి అవసరం. దీనికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కొటిక్స్ జారీ చేసే లైసెన్స్ తప్పనిసరి. దేశంలో ఎవరైనా ఎక్కడైనా అనుమతి లేకుండా ఓపియం పాపీ సాగుచేస్తే, అది చట్టరీత్యా నేరం. అదేవిధంగా దీన్ని నిల్వ ఉంచినా, రవాణా చేసినా, విక్రయించినా తీవ్రమైన నేరం. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నార్కొటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ చట్టం ఎన్‌డీపీఎస్ – 1985 చట్టం కింద కేసులు నమోదు చేస్తారు. ఈ చట్టం ప్రకారం కఠినమైన నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారు. దోషులుగా తేలితే పది సంవత్సరాలకు పైగా జైలుశిక్ష, లక్షన్నర వరకు జరిమానా విధిస్తారు.


