చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల సందర్భంగా పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. సంతానం లేని వారికి ప్రత్యేక ప్రసాదం పంపిణీ చేస్తుండటంతో ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ఆలయ పరిసరాల్లో ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భక్తులు రోడ్డు మీదే వాహనాలను నిలిపివేసి ఆలయానికి వెళ్తున్నారు. ఉదయం ఐదు గంటల నుంచే భక్తులు బారులు తీరారు. దీంతో రాజేంద్రనగర్ పోలీస్ అకాడమీ దగ్గర భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సంతానం లేని వారికి ప్రత్యేక ప్రసాదం పంపిణీ చేస్తుండటంతో హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ లో స్కూల్ బస్సులు ఇరుక్కుపోయాయి. విద్యార్థులు, ఉద్యోగాలకు వెళ్లేవాళ్లు ట్రాఫిక్ రద్దీతో ఇబ్బందులు పడుతున్నారు.


