2024 పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి లోటు పాట్లు జరగకుండా ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి పెట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కలిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని లోక్ సభ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఈసీ. అబ్జర్వర్లతో ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని అధికారులను అప్రమత్తం చేస్తోంది. ఎలక్షన్ కమిషన్. ఎన్నికల నిబంధనల అమలు విషయంలోనే కాక, అధికారులపై కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టింది కమిషన్.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. నోటిఫికేషన్ విడుదలైంది మొదటి రోజే 42 మంది అభ్యర్థులు 48 నామినేషన్లు నామినేషన్లను దాఖలు చేశారు. 25వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 26న స్కూటీని. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఈనెల 29. నామినేషన్ ప్రక్రియ చాలా కీలకమైన ఘట్టమని నామినేషన్ పత్రాలు, అఫిడవిట్ లో ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టకుండా ప్రతి అంశాన్ని పూర్తిగా పేర్కొని, రిటర్నింగ్ అధికారికి దాఖలు చేయాలని మఖ్య ఎన్నికల అధికారి వికాశ్ రాజ్ సూచించారు. అభ్యర్థితోపాటు రిటర్నింగ్ అధికారి ఆఫీసులోకి నలుగురు మాత్రమే అనుమతి ఉంటుంది. ఒకసారి రిటర్నింగ్ అధికారి ఆఫీసులోకి వచ్చిన అభ్యర్థి మళ్లీ బయటకు వెళ్లి ఏదైనా పత్రాలు తీసుకువచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు సీఈఓ వికాస్ రాజ్.
ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలకు స్పష్టంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై అవగాహన కల్పించామని, నిబంధన లకు విరుద్ధంగా ప్రచారం చేసినా, ఇతర కార్యక్రమాలకు పాల్పడిన కచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని సిఈఓ హెచ్చరించారు. ఇక ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కోడ్ ఉల్లంఘనకు సంబంధించి దాదాపు నాలుగువేల ఎస్ ఐఆర్ లు నమోదు అయినట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిరిసిల్లలో చేసిన కామెంట్స్ పై వివరణ ఇచ్చారని వారం రోజులు టైం అడిగినట్లు ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాశారని వివరించారు సీఈవో వికాస్ రాజ్. ఏదైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబం ధించి నిబంధనలు అతిక్రమిస్తే ఫిర్యాదులు వచ్చిన వెంటనే కచ్చితమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే సుమోటోగా కేసు పరిశీలించి చర్యలు తీసుకుంటామని వివరించారు.
తెలంగాణలో 17 లోక్ సభ నియోజకవర్గాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒక అసెంబ్లీ స్థానానికి ఎలక్షన్స్ జరుగుతు న్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 35 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఉండగా మూడు కోట్ల 31 లక్షల మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటివరకూ మహిళల ఓట్లు మరింత పెరిగాయని పేర్కొన్నారు. దీనితోపాటు అంతరాష్ట్ర చెక్ పోస్ట్ లు, క్లిష్టమైన పోలింగ్ స్టేషన్స్ పై గట్టినిఘా పెట్టామని సిఈఓ వివరించారు. తెలంగాణ రాష్ట్రానికి 17 మంది జనరల్ అబ్జర్వర్లు, 34 మంది పోలీస్ అబ్సర్వర్లు, 9 మంది ఎన్నికల వ్యయాలకు సంబంధించిన పరిశీలకులు క్షేత్రస్థాయిలో పనిచేస్తు న్నారని పేర్కొన్నారు. దీంతోపాటు రాష్ట్రానికి 160 కేంద్ర కంపెనీల బలగాలు కేటాయించగా 60 కేంద్ర కంపెనీల బలగాలు రాష్ట్రానికి చేరుకుని విధుల్లో చేరినట్లు వివరించారు. అసెంబ్లీ ఎన్నికలకు అబ్జర్వర్ల చేత ప్రత్యేక నిఘా పెట్టిన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, రానున్న లోక్ సభ ఎన్నికలకు సైతం అబ్జర్వర్ల చేత ప్రత్యేకమైన నిఘా పెట్టింది ఈ సీఐ. ఇందులో భాగంగా అభ్యర్థుల ఖర్చు పైనా నిఘా పెట్టి, ఎప్పటి కప్పుడు తనిఖీలు చేస్తూ… నగదు సీజ్ చేస్తుంది ఈసీఐ. గత అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నగదు పట్టుకున్న ఈసీఐ ఇప్పుడు ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో..


