28.2 C
Hyderabad
Monday, January 26, 2026
spot_img

రాజకీయాలకు సినీ గ్లామర్

లోక్ సభ ఎన్నికల్లో సినీ, టీవీ తారలు హల్ చల్ చేస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల తరుపున దాదాపు 20 మందికి పైగా నటీ నటులు ఎన్నికల గోదాలో దిగి.. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తమ గ్లామర్ తో రాజకీయాల పార్టీలను ఆకట్టుకుని ఎంపీ టికెట్ దక్కించుకుని పోటీ చేస్తున్న సినీ, టీవీ నటీ నటులెందరో.

ప్రస్తుత రాజకీయాల్లో రాణిస్తున్న సినీ, టీవీ నటీ మణుల్లో హేమమాలిని, స్మృతి ఇరానీ ప్రముఖులు.. గతంలో రెండు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యంవహించిన హేమమాలిని, 2014లో, 2019లో బీజేపీ తరుపున ఉత్తరప్రదేశ్ లోని మధుర నుంచి పోటీచేసి విజయం సాధించారు. ప్రస్తుతం అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో అమేధీలో రాహుల్ గాంధీనే ఓడించి కేంద్ర మంత్రి పదవిచేపట్టిన స్మృతి ఇరానీ మళ్లీ అక్కడి నుంచే మూడో సారి పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలోని అమరావతి నుంచి నటి నవనీత్ కౌర్, కర్ణాటక లోని మాండ్య నుంచి నటి సుమలత గత ఎన్నికల్లోనే గెలిచి లోక్ సభలో అడుగు పెట్టారు. మళ్లీ ఈ సారి పోటీ చేస్తున్నారు. ఈ సారి లోక్ సభలో తొలిసారిగా ఎన్నికల రంగంలోకి దిగుతున్నవారిలో బాలివుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఒకరు. హిమాచల్ ప్రదేశ్ లోని మండీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తెలుగు, తమిళ హీరోయిన్ రాధిక తమిళనాడులోని విరుదునగర్ నుంచి డిఎండికే తరుపున లోక్ సభకు పోటీ చేస్తున్నారు. మలయాళ నటుడు సురేశ్ గోపీ బీజేపీ నుంచి కేరళలోని త్రిశ్సూర్ లో లోక్ సభకు పోటీ చేస్తున్నారు. కన్యాకుమారి నుంచి తమిళనటుడు సిట్టింగ్ ఎంపీ విజయ్ వసంత్ మరో సారి పోటీ చేస్తున్నారు. కడలూర్ నుంచి బీజేపీ కూటమిలో పిఎంపీ నుంచి నటుడు, దర్శకుడు తంగన్ బచన్ పోటీ చేస్తున్నారు. కర్ణాటక సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ భార్య గీత శివరాజ్ కుమార్ శివమొగ్గ నియోజకవర్గం నుంచి ఎంపీ గా పోటీ చేస్తున్నారు.

పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ నుంచి బెంగాలీ నటి లాకెట్ ఛటర్జీ బీజేపీ నుంచి పోటీ చేస్తుండగా, మరో నటి రచనా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. బెంగాలీ నటుడు దీపక్ అధికారి అలియాస్ దేవ్ వరుసగా మూడో సారి టీఎంసీ నుంచి ఘటక్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఆయనకు మరో బెంగాలీ నటుడు హిరణ్మయి ఛటోపాధ్యాయ పోటీ ఇస్తున్నారు. సీనియర్ నటుడు శతృఘ్న్ సిన్హా టీఎంసీ నుంచి అసన్ సోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. టీవీ రాముడు అరుణ్ గోయల్ కూడా బిజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లో అజంగఢ్ నుంచి భోజ్ పురి నటుడు దినేశ్ లాల్ యాదవ్, నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి మరో భోజ్ పురి నటుడు మనోజ్ తివారి, ఒడిశాలోని బౌలంగిర్ నుంచి ఒడియా నటుడు మనోజ్ మిశ్రా, పంజాబ్ ఫరీద్ కోట్ నుంచి నటుడు కరంజీత్ అను మోల్, పోటీ చేస్తుండగా వాయవ్య ఢిల్లీలో పంజాబీ గాయకుడు హన్స్ రాజ్ హన్స్ పోటీ చేస్తున్నారు.

రాజకీయాలలో సినీనటులు పాల్గొనడం ఇదే కొత్తకాదు. ఆరు దశాబ్దాల క్రితమే.. ఎంజీఆర్ ఎన్నికల రాజకీ యాల్లో కి వచ్చి తమిళనాడు ముఖ్యమంత్రిపదవి చేపడితే, తర్వాత జయలలిత, ఆంధ్రప్రదేశ్ లో మహాన టుడు ఎన్టీ రామారావు సీఎం పదవి అలంకరించారు. తెలుగు హీరోలు కృష్ణ, కృష్ణంరాజు వంటి వారు ఎంపీలుగా ఎన్నికయ్యారు. నటి జయప్రద ఎంపీగా ఎన్నికయ్యారు. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, సునిల్ దత్,ధర్మేంద్ర, కిరణ్ ఖేర్, అనుపమ్ ఖేర్ వంటి పలువురు హిందీ నటులు, నటీ మణులు రాజకీయాల్లో రాణించారు.  

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్