ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ ఇవాళ బస్సు యాత్రకు విరామం ఇచ్చారు. మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్ర ప్రస్తుతం పల్నాడు జిల్లాలో కొనసాగుతోంది. నిన్న రాత్రి సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాళ్లలోనే జగన్ బస చేశారు. నిన్న అయ్యప్పనగర్ బైపాస్ వద్ద బహిరంగ సభలో పాల్గొన్న జగన్. సభ అనంతరం కొండమోడు జంక్షన్, అనుపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం మీదుగా ధూళిపాళ్ల దగ్గర రాత్రి బస శిబిరానికి చేరుకున్నారు. ఇవాళ రంజాన్ సందర్భంగా యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో జగన్ భేటీ కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు.


