\మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివశంకర్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జులై 22వ తేదీకి వాయిదా వేసింది. శివశంకర్ రెడ్డికి ఇటీవల తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు తీర్పును వివేకా కుమార్తె సునీత.. సుప్రీంలో సవాలు చేశారు. సునీత పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ నిర్వహించింది. శివశంకర్ రెడ్డితో పాటు ప్రతివాదులందరికీ సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.


