లోక్ సభ ఎన్నికలవేళ.. మణిపూర్ మూగబోయింది. ఎన్నికలకు వేడి కన్పించడం లేదు. దాదాపుగా ఏడాదిగా హింసా త్మక ఘర్షణలు, అల్లర్లతో ఉక్కిరి బిక్కిరవుతున్న మణిపూర్ లో ఎన్నికల ప్రచారం చాప కింద నీరులా సాగుతోంది. బహిరంగ సభలు లేవు ర్యాలీలూ లేవు, పోస్టర్లు లేవు. చిన్న చిన్న సమావేశా లకే ప్రచారం పరిమితమవుతోంది. సభలు బహిరంగ ప్రచారం పట్ల ప్రజలు విముఖత స్పష్టమవు తోంది. ఎవరు గెలిచినా ఓడినా పెద్దగా మారదనే నిర్లిప్తత ఓటర్లలో కన్పిస్తోంది.
మణిపూర్ లో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఎన్నికల ప్రక్రియపై సందిగ్ధత నెలకొనడంతో ప్రచారం నిశ్శబ్దంగా చిన్నస్థాయిలోనే సాగుతోంది. రాష్ట్రంలోని రెండు సీట్లలో ఒకటైన ఇన్నర్ మణిపూర్ నియోజక వర్గంలో, మెయిటీ మెజారిటీ లోయ ప్రాంతంలో ఎక్కువ భాగం ఉన్న నియోజకవర్గంలో ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. మణిపూర్ లో రెండు నియోజకవర్గాల్లో ఓ నియోజకవర్గంలోనూ.. మరో నియోజకవర్గంలోని కొంత భాగం ఏప్రిల్ 19న ఎన్నికలు నిర్వహిస్తుండగా. ఆ నియోజకవర్గంలో రెండో భాగంలో ఏప్రిల్ 26న పోలింగ్ నిర్వహిస్తున్నారు. మణిపూర్ లో 2009లో, 2014లో జరిగిన ఎన్నికల్లో 2 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీజేపీ ఒక స్థానాన్ని, ఎన్ పిఎఫ్ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. 2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా సగటున 67 శాతం ఓట్లు పోలైతే.. మణిపూర్ లో 82.8 శాతం ఓట్లు పోల్ కావడం మణిపూర్ లో ఓ రికార్డు .
ఏప్రిల్ 19, 26 తేదీల్లో మణిపూర్ లో రెండు దశల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర వాతావరణం అంతర్గతంగా నెలకొన్న అశాంతికి అద్దం పడుతోంది. ఇంఫాల్ లోయ ఎన్నికలకు రెండు వారాల ముందు, ప్రచార సమయంలో బహిరంగ సభలు, విందులు, లౌడ్ స్పీకర్ల వాడకానికి దూరంగా ఉండాలని మెయిటీ రాడికల్ గ్రూపు అరంబాయి టెంగోల్ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేయడంతో ప్రచారం చాలా మందకొడిగా సాగుతోంది. హింసాకాండతో కుతకుతలాడిన మణిపూర్ లో పెద్దఎత్తున ఎన్నికల ప్రచారానికి రాజకీయ పార్టీలు సిద్ధంగా లేవు. మణిపూర్ లో బలమైన మైతీ వర్గానికి చెందిన మహిళా గ్రూప్ మీరా పైబీలు ఇంఫాల్ లోని చింగా మఖా ప్రాంతంలో గార్డ్ పోస్ట్ వద్ద రాత్రి పొద్దుపోయాక ఇన్నర్ మణిపూర్ లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికోసం ప్రచారం ప్రారంభించారు. మరి కొందరు మహిళా వాలంటీర్లు వారితో కలిశారు. అదీ ఎన్నికల ప్రచార సరళి. శరణార్థి శిబిరాలు, పునరా వాస శిబిరాలలోనూ చిన్న స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర కేబినెట్ మంత్రి, మాజీ ఐపీఎస్ అధికారి తౌనౌజమ్ బసంత్ సింగ్ బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యావేత్త, అసోసియేట్ ప్రొఫెసర్ బిమోల్ అకోయిజమ్ తొలిసారి రాజకీయ అరంగేట్లం చేస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) తరుపున మహేశ్వర్ తౌనోజమ్, మణిపూర్ పీపుల్స్ పార్టీకి చెందిన ఆర్ కె సోమేంద్ర ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గం ఎన్నికల్లో పోటి పడుతున్నారు.అభ్యర్థులు ప్రధానంగా “ఇన్-కెమెరా” సమావేశాల ద్వారా ఓటర్లను చేరుకుంటున్నారు. ఇందులో 20-50 మందితో కూడిన బృందా లు స్థానిక నాయకుల ఇళ్లు లేదా ప్రైవేట్ కార్యాలయాల వద్ద పాల్గొంటాయి. అభ్యర్థులు వివిధ ప్రాంతాల్లో అమ్మ వారికి పూజలు చేస్తూ తమను తాము పరిచయం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. బీజేపీ బూత్ స్థాయి కార్య కర్తలను ఇంటిం టికీ వెళ్లి సమావేశాలు నిర్వహించేందుకు రంగంలోకి దింపింది. 2019 ఎన్నికల్లో ప్రధాని, హోం మంత్రి, ముఖ్యమంత్రి భారీ సభలు, ర్యాలీలు నిర్వహించారు.
ఈసారి జాతీయ నాయకులు ఎవరూ రాలేదు. ప్రచారం చేయడంలేదు. హింస జరిగినప్పుడు రాని నాయకులు ఓట్లకోసం వచ్చేరని ప్రజలు దుమ్మెత్తి పోస్తారనే భావనే ఇందుకు కారణంగా కల్పిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సెక్రటే రియట్ కు పెద్దఎత్తున వ్యాన్ లో మహిళలను తీసుకురావడంతో సీఎం వర్గాలు ఎన్నికల కోడ్ ఉల్లంఘి స్తున్నాయని కాంగ్రెస్ ప్రధాన ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. మైదానప్రాంతాలలో మెయిటీలు, మెయిటీ పంగల్లు నివసిస్తుండగా, కుకీలు కొండల దిగువన, నాగాలు కొండల ఎత్తైన ప్రాంతాల్లో నివసిస్తు న్నారు. నాగాలు ప్రస్తుత సంఘర్షణ నుండి దూరంగా ఉన్నారు. తటస్థంగా ఉన్నారు, ఎన్నికలు అయిష్టం గానే జరుగుతున్నా, ఎన్నికల తర్వాత మణిపూర్ సమస్యకు పూర్తిస్థాయి రాజకీయ పరిష్కారం కుదరాలని మణిపూర్ వాసులే కాదు. ఈశాన్య భారతం ప్రజలు, దేశ వ్యాప్తంగా ప్రజాస్వామిక వాదులు కోరుతున్నారు.


