మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిపై కేసు నమోదు అయ్యింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించారని ఎన్నికల ఫ్లయింగ్ స్కాడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రవర్తన నియామా వళికి వ్యతిరేకంగా వెంకటరామిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎలక్షన్ ఫ్లయింగ్ స్కాడ్ ఫిర్యాదు మేరకు వెంకటరామిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం అర్థరాత్రి ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో ఓ భవనంలో రహస్యంగా సమావేశం పెట్టారని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపించారు. వెంకటరామిరెడ్డి ఉద్యోగులతో భేటీ అయిన భవనానికి తాళం వేసి పోలీసులకు సమాచారం అందిం చారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్కాడ్ ఫిర్యాదు మేరకు వెంకటరామిరెడ్డిపై కేసు నమోదు అయ్యింది.


