టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారని టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కుమార్ అన్నారు. రాష్ట్రానికి అద్భుతాలు చేసి చూపించారని చెప్పారు. వైసీపీ ప్రభు త్వంలో ఉద్యోగాలు లేక యువత ఎన్నో ఇబ్బందులు పడతున్నారని, వలస వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని పరిపాలించే ముఖ్యమంత్రిని బట్టే ప్రజల భవిష్యత్తు నిర్ణయించబ డుతుం దని విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని మండిపడ్డారు. టీడీపీ ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి 100 పరిశ్రమలను తీసుకొచ్చిందని గుర్తు చేశారు.


