తెలంగాణలో చికెన్ రెట్లు అమాంతం పెరిగాయి. స్కిన్ లెస్ కేజీ చికెన్ ధర 300గా ఉంది. సరిగ్గా రెండు వారాల క్రితం చూస్తే కేజీ చికెన్ స్కిన్ లెస్ ధర 200 నుంచి 220 వరకు పలికింది. అలాగే స్కిన్‌తో చికెన్ కిలో 180 నుంచి 200 మధ్య అమ్మకాలు జరిపారు. అయితే ఈ మధ్య కాలంలో క్రమంగా ధరలు పెరుగు తూ వస్తున్నాయి. ఈ ధర 300కి చేరటంతో మాంస ప్రియులు షాక్ అవుతున్నారు. స్కిన్‌తో అయితే 270 నుంచి 280 మధ్య అమ్ముతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంది. మార్చి, ఏప్రిల్ మాసంలోనే గరిష్ట్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఎండ వేడిమితో ఫ్రౌల్టీలలోని కోళ్లు చనిపోతున్నాయి. దీంతో ఉత్పత్తి తగ్గటంతో మార్కెట్‌లో ఒక్కసారిగా డిమాండ్ పెరుగుతూ వచ్చేసింది. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారుల చెబుతున్నారు.


