జనగామ జిల్లా పాలకుర్తిలో బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పేరు మార్చే ఆలోచన చేస్తున్నామని అన్నారు. మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చేందుకు కసరత్తు ప్రారంభించినట్లు తెలిపారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత పార్టీకి పెద్దగా కలిసి రావడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. పార్టీ పేరు మార్పుపై ప్రజల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమైందని ఈ సందర్భంగా తెలియజేశారు. బీఆర్ఎస్ పేరుతో ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామని స్వయంగా క్షేత్రస్థాయి లీడర్లు అధిష్టానం వద్ద మొరపెట్టుకున్న విషయాన్ని గుర్తుచేశారు.


