కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన రైతు హామీలను అమలు చేయాలని సిద్దిపేట ఆర్డీఓ కార్యా లయం ఎదుట బీఆర్‌ఎస్ నాయకులు రైతు దీక్ష చేపట్టారు. దీక్షలో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్ రాం రెడ్డి, బీఆర్‌ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌పై బురద జల్లేందుకే రాజకీ యం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేస్తున్నా మని వెంకట్ రాంరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ సమయంలో పథకాల అమలులో విఫలం అయిందన్నారు. రాజకీయమే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ పని చేస్తోం దన్నారు.


