ఢిల్లీ లిక్కర్ కేసులో జ్యూడీషియల్ రిమాండ్ ముగియడంతో ఆప్ నేత మనీష్ సిసోడియాను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. సిసోడియాకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించింది. ఏప్రిల్ 18 వరకు కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయిం తీసుకుంది. దీంతో ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఈనెల 18 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిం చారు. మద్యం కుంభకోణంలో తన ప్రమేయాన్ని కేంద్ర ఏజెన్సీలు ఇంకా రుజువు చేయలేదని సిసోడియా పేర్కొన్నారు. మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫిబ్రవరి 26, 2023 న లిక్కర్ స్కామ్‌లో అరెస్టు చేసింది. అనంతరం మార్చి 9, 2023న మనీలాండరింగ్ కేసులో ఈడీ కూడా అరెస్టు చేసింది. ఫిబ్రవరి 28, 2023న ఢిల్లీ కేబినెట్ నుంచి సిసోడియా తప్పుకున్నారు. తన పదవికి రాజీనామా చేశారు.


