బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని.. భూగర్భ జలాలు అడుగం టాయని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రైతులకు నష్టం జరిగిందంటే వర్షాభావ పరిస్థితులే కారణ మని… ప్రాజెక్టులపై ఎప్పుడు చర్చకు రమ్మన్న తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ఉత్తర భారతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఆదుకున్నటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. కరువుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కారణం కాదన్నారు. రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.