“పాంచ్ న్యాయ్” నినాదంతో కాంగ్రెస్ 2024 లోక్ సభ ఎన్నికల యుద్ధ భేరీ మోగించింది. కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టో లో ఈ ఐదు అంశాలే కీలకం. ఈ ఐదు సూత్రాలు దేశప్రగతికి మూల స్థంభాలుగా నిలుస్తాయని కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మేనిఫెస్టోను ఢిల్లీ లో విడుదల చేశారు. యువన్యాయ్, నారీ న్యాయ్, కిసాన్ న్యాయ్ , శ్రామిక్ న్యాయ్, హిస్సెదారీ న్యాయ్ గా ఐదు గ్యారంటీలను ప్రజలకు ఎన్నికల వేళ వాగ్దానం చేసింది.
దేశవ్యాప్తంగా ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా విస్తృత చర్చల తర్వాత మేనిఫెస్టో రూపుదిద్దు కున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోని యాగాంధీ, రాజీవ్ గాంధీ హైదరాబాద్ లోనూ జైపూర్ లోనూ రేపు బహిరంగ సభల్లో మేనిఫెస్టో విడుదల చేసి.. .ఈ అంశాలను వివరిస్తారు.


