ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నేటి నుంచి షర్మిల బస్సు యాత్రతో జనం ముందుకు వెళుతున్నారు. కడప జిల్లా బద్వేల్ నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభమైంది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలను సాధించే లక్ష్యంతో షర్మిల బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇవాళ ఉదయం బద్వేల్ నియోజకవర్గం కాశినాయన మండలం అమగంపల్లి గ్రామం నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటుకుల పాడు, సవిషెట్టిపల్లి, వరికుంట ల్, బాలయ్య పల్లి, నర్సాపురం, గుంటవారి పల్లి, కాలసపాడు, మహానందిపల్లి మీదుగా బస్సు యాత్ర సాగనుంది. అక్కడి నుంచి మామిల్లపల్లి, లింగారెడ్డి పల్లి, పొరు మామిళ్ళ, పాయల కుంట్ల, బద్వేల్ టౌన్, అట్లూరు మీదుగా షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.


