ప్రజా సమస్యలు తీర్చడంలో తాను ఎప్పుడు ముందుంటానని కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. అల్వాల్ పరిధిలోని పంచశీల కాలనీలో మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇంచార్జ్ మైనంపల్లి హనుమంతరావుతో కలిసి సునీత మహేందర్ రెడ్డి కాలనీ వాసుల తో సమావేశం ఏర్పాటు చేశారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ లో మరోసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమా లు చేశానని ఆమె గుర్తు చేశారు. ప్రతి సమస్యను తన ద్వారా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దేవుళ్ళని అడ్డం పెట్టు కొని తాము రాజకీయాలు చేయమని బిజెపి పార్టీ ఉద్దేశించి మైనంపల్లి హనుమం తరావు అన్నారు. హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని మైనంపల్లి కోరారు.