నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కట్టకు గండి పడింది. దీంతో కెనాల్‌ను ఆనుకొని ఉన్న కాలనీల్లోకి నీరు ప్రవహించింది. తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నీటి ప్రవాహం ఇండ్లలోకి రావడంతో కాలనీ వాసులు బయటకు పరు గులు తీశారు. ఎగువ ప్రాంతంలోని కాలనీల మురికి నీరు కూడా నిజాంసాగర్ కెనాల్‌లో వచ్చి చేరుతుం ది. నీటి ప్రవాహంతో విద్యుత్ స్తంభాలు తెగిపోయాయి. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కెనాల్ కట్ట తెగిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి సహాయక చర్య లు మొదలుపెట్టాలని కోరుతున్నారు.


