20.7 C
Hyderabad
Friday, December 27, 2024
spot_img

కేసులు, అరెస్టులే మోడీ మార్క్‌ రాజకీయమా ?

      బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు గళమెత్తినా వారిని టార్గెట్ చేస్తోంది ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్. ఇటీవల వరుసగా హేమంత్ సోరేన్‌, అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి జైలుకు పంపింది. తాజాగా ఆప్ మంత్రి కైలాష్ గెహ్లాట్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఎపిసోడ్ ఇటీవల జాతీయ రాజకీయాల్లో హాట్‌  టాపిక్‌గా మారింది. సొమ్ములు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలు వేశారన్న ఆరోపణలపై నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించారు. అయితే తన వివరణ వినకుండానే ఏకపక్షంగా బహిష్కరణ వేటు వేశారని మహువా మండిపడ్డారు. 2014లో అధికారానికి వ‌చ్చిన నరేంద్ర మోడీ ప్ర‌భుత్వం రాష్ట్రాల హక్కులు హ‌రించే విధంగా నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఫెడ‌ర‌లిజానికి తూట్లు పొడుస్తోంది. వీలు దొరికిన‌ప్పుడ‌ల్లా రాష్ట్రాల హ‌క్కుల‌ను హ‌రించేస్తోంది.

లోక్‌సభ ఎన్నికలు తరుముకువస్తున్న వేళ ప్రతిపక్షాల గొంతు నొక్కడమే పనిగా పెట్టుకుంది ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం. కొన్ని నెలల కిందట మనీ లాండరింగ్ కేసులో ఉన్న ఝార్కండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌ అరెస్టుకు రంగం సిద్ధం చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌. ఇక అరెస్టు తప్పదనుకున్న హేమంత్ సోరేన్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత హేమంత్‌ను జైలుకు పంపింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌. హేమంత్ సోరేన్ జైలుకు వెళ్లాక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను టార్గెట్ చేసింది కేంద్ర ప్రభుత్వం.ఢిల్లీ నూతన మద్యం పాలసీని అడ్డం పెట్టుకుని కేజ్రీవాల్‌ను కూడా జైలుకు పంపేవరకు నరేంద్ర మోడీ సర్కార్ నిద్రపోలేదు. అరవింద్ కేజ్రీవాల్ కొంతకాలంగా భారతీయ జనతా పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు. ఢిల్లీని ఆమ్ ఆద్మీ పార్టీకి అడ్డాగా చేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, మొహల్లా క్లినిక్‌లతో హస్తినలోని బస్తీ ప్రజల ఆదరాభిమానాలు పొందారు.

ఒక్కమాటలో చెప్పాలంటే ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ సవాల్‌ను ఎదుర్కొని నిలబడ్డారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అవమానాలు భరించి ప్రజల ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యలోనూ తన మద్యం పాలసీ కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఒక సాకుగా దొరికింది. ఇదిలా ఉంటే జైలుకెళ్లినా అక్కడ్నుంచే కేజ్రీవాల్ పరిపాలన ప్రారంభించారు. జైలునే ముఖ్యమంత్రి పేషీగా చేసుకున్నారు. జైలు నుంచే అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడం మొదలెట్టారు. ఇది కూడా కేంద్ర ప్రభుత్వానికి మింగుడుపడలేదు. ఈ పరిణామం సహించలేకపోయారు కమలం పార్టీ పెద్దలు. దీంతో జైలు నుంచి ముఖ్యమంత్రి పాలన చేయడాన్ని కూడా చర్చనీయాంశం చేశారు. ఇదే విషయమై ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. అయితే కేజ్రీవాల్‌కు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వడం విశేషం. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను కూడా మద్యం పాలసీ కేసులో అరెస్టు చేసి జైలుకు పంపింది ఈడీ. జైలుకెళ్లాక ఉప ముఖ్యమంత్రి పదవికి మనీశ్ సిసోడియా రాజీనామా చేశారు. కాగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి కైలాష్ గెహ్లాట్‌కు తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈ వరుస చూస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలెవరినీ ఈడీ వదిలేలా లేదు. ఒక్క ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలనే కాదు కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఎవరు గొంతెత్తినా వారికి వేధింపులు తప్పడం లేదు.

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఎపిసోడ్ ఇటీవల జాతీయ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. సొమ్ములు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలు వేశారన్న ఆరోపణలపై నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించారు. అయితే తన వివరణ వినకుండానే ఏకపక్షంగా బహిష్కరణ వేటు వేశారని మహువా మండిపడ్డారు. మరణశిక్ష అమలు చేయడానికి ముందు కూడా , దోషికి చెప్పుకునే అవకాశం ఇస్తారు. అయితే ఇక్కడ సొమ్ములు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్న మహువా మొయిత్రాకు మాత్రం లోక్‌సభలో తన వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. మహిళా బిల్లు గురించి జబ్బలు చరచుకునే కేంద్రప్రభుత్వం ఒక మహిళా ఎంపీ పట్ల వ్యవహరించిన తీరు ఇది. మహువా మొయిత్రా కొంతకాలంగా పశ్చిమ బెంగాల్లో భారతీయజనతా పార్టీకి కంట్లో నలుసులా మారారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే మహువాను లోక్‌సభ నుంచి బహిష్కరించారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపించింది.

మ‌న‌దేశంలో అనేక జాతుల‌కు చెందిన ప్ర‌జ‌లున్నారు. భిన్న‌త్వంలో ఏక‌త్వం భార‌త‌దేశ ప్ర‌త్యేక‌త‌. ఈ నేప‌థ్యంలో ఫెడ‌ర‌లిజానికి రాజ్యాంగ నిర్మాత‌లు పెద్ద పీట వేశారు. మ‌న‌ది ”సమాఖ్య” రాజ్యాంగం అని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ స్ప‌ష్టంగా ప్ర‌క‌టించారు. కేంద్రానికి, రాష్ట్రాలకు రాజ్యాంగం ఒకే ర‌క‌మైన ప్రాధాన్యం ఇచ్చింది. కేంద్రానికి రాజ్యాంగం ఇచ్చిన నిర్వ‌చ‌నం….యూనియ‌న్ ఆఫ్ స్టేట్స్ త‌ప్ప మ‌రొక‌టి కాదు. రాజ్యాంగం ప్ర‌కారం కేంద్రంలో ఉండేది ”సమాఖ్య ప్ర‌భుత్వ‌”మే. కేంద్రానికి ఎల్ల‌లు అంటూ ఏమీ లేవు. 80ల్లో రాష్ట్రాల హ‌క్కుల‌ను కాల‌రాయడానికి అప్ప‌టి ఇందిరా గాంధీ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించిన‌ప్పు డు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స‌హా అనేక మంది కాంగ్రెసేతర ముఖ్య‌ మంత్రులు, రాజ్యాంగ నిపుణులు తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఎన్టీఆర్‌ అయితే ఒక ద‌శ‌లో కేంద్రాన్ని మిథ్య అని కూడా అన‌డాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకోవాలి.

ఇటీవల ఒకే దేశం – ఒకే ఎన్నిక పల్లవి అందుకుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఎన్నిక‌ల ఖ‌ర్చు త‌గ్గించ‌డం అనే ముసుగులో ప్రాంతీయ పార్టీలను కనుమరుగు చేసే కొత్త ఎత్తుగ‌డ‌ను కేంద్రం ప‌న్నుతోంది. ఒకే దేశం – ఒకే ఎన్నిక విధానం అమ‌లులోకి వ‌స్తే ఎన్నిక‌ల్లో జాతీయ అంశాలే కీల‌కంగా మారి, రాష్ట్రాల స‌మ‌స్య‌లు గాలికి కొట్టుకుపోతా యంటున్నారు రాజ్యాంగ నిపుణులు. చివ‌ర‌కు జాతీయ పార్టీలు బలోపేత‌మై, ప్రాంతీయ పార్టీలు అంత‌రించిపోయే ప్ర‌మాదం ఉందని ప్ర‌జాస్వామ్యవాదులు హెచ్చరిస్తున్నారు. మరో వైపు ప్రతిపక్షాల ఆదాయవనరులను దెబ్బతీస్తోంది. ఇటీవల ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేశారు. లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్న సమయంలో ఏ పార్టీకైనా నిధుల అవసరం ఉంటుంది. అయితే ఆదాయపు పన్ను చెల్లించలేదన్న సాకుతో కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసింది ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్. ఇది నిస్సందేహంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే.

రాజ్యాంగం ఏడో షెడ్యూల్ లో కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన స్ప‌ష్టంగా ఉంది. కేంద్ర జాబితాలో 97 అంశాలు, రాష్ట్ర జాబితాలో 66 అంశాలు, ఉమ్మడి జాబితాలో 47 అంశాలున్నాయి. కేంద్ర, రాష్ట్రాలు ఎవ‌రి ప‌రిధుల్లో వాళ్లు ఉండాల‌ని రాజ్యాంగం పేర్కొంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య విభ‌జ‌న గీత‌లు కూడా స్ప‌ష్టంగా గీసింది. అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇది కేంద్రం జాబితా, ఇది రాష్ట్రాల జాబితా అనే పట్టింపులు ఏమీలేవు. రాష్ట్రాల జాబితాలో ఉన్న వ్యవసాయానికి సంబంధించి 2020-21 మధ్యకాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంతోనూ చర్చించకుండా ఏకంగా మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం చేసింది. దీంతో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివారుల్లో రైతులు దాదాపు ఏడాదిపాటు ఆందోళనలు నిర్వహించారు. రైతన్నల ఉద్యమ తీవ్రతను చూసి, ప్రధాని నరేంద్ర మోడీయే వెనక్కి తగ్గారు.చివరకు అన్నదాతలకు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ క్ష‌మాప‌ణ చెప్పారు. మూడు వ్యవసాయ చట్టాల వివాదం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ బ‌య‌ట‌ప‌డ్డారు.

Latest Articles

‘అనగనగా ఒక రాజు’ ప్రీ వెడ్డింగ్ వీడియో టీజర్ రిలీజ్

యువ సంచలనం నవీన్ పొలిశెట్టి మూడు వరుస ఘన విజయాలతో తెలుగునాట ఎంతో పేరు సంపాదించుకున్నారు. అనతికాలంలోనే అన్ని వర్గాల ప్రేక్షకుల మనసు గెలిచిన కథానాయకుడిగా నిలిచారు. ప్రస్తుతం అత్యధిక డిమాండ్ ఉన్న...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్