తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు

  తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. తెల్లవారుతూనే భానుడు మండిపోతున్నాడు. రోజురోజుకీ పెరిగిపో తున్న ఎండలతోపాటు ఈ నెలలోనే వడగాలుల తీవ్రత కూడా మొదలైంది. సూర్యుడి ప్రతాపంతో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నట్లు వాతావరణ అధికా రులు చెపుతున్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో 41 నుంచి 43 డిగ్రీల మధ్యన ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. దీంతో పెరుగుతున్న ఎండలకు ఎవరూ బయటకు కూడా రావడంలేదు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన కూడా జారీ చేసింది. ఇవాళ 50 మండలాల్లో వడగాల్పులు, రేపు 56 మండలాల్లో వడగా ల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ తెలిపారు.

ఇక శుక్రవారమే 31 మండలాల్లో వడగాల్పులు, కడప జిల్లా ముద్దనూరులో తీవ్ర వడగాల్పులు వీచినట్లు వివ రించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వడగాల్పులు వీచే అవకాశం ఉన్న దృష్ట్యా చర్య లు తీసుకోవాలని వెల్లడించారు. నిన్న కడప జిల్లా ముద్దనూరులో తీవ్ర వడగా ల్పులు నమో దైనట్లు తెలిపారు.ఇక తెలంగాణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మంచి ర్యాల జిల్లాలో 42.1 డిగ్రీలు, ఆసిపాబాద్ జిల్లా 42.5, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమో దైనట్లు సమాచారం. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నాలుగు జిల్లాలతో సహా మరో మూడు జిల్లాలకు వాతా వరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Latest Articles

విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్