ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. వైసీపీ అధినేత, సీఎం జగన్ రేపటి నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు. 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి అన్ని పార్టీల కన్నా ముందంజలో ఉన్న వైసీపీ అధినేత.. రేపటి నుంచి ప్రచార పర్వంలోకి దిగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేశారు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో ఏపీ వ్యాప్తంగా జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది. రేపు ఇడుపులపాయలో దివంగత సీఎం వైఎస్సార్ ఘాట్ వద్ద.. ప్రార్థనల అనంతరం ‘మేమంతా సిద్ధం’ యాత్ర ప్రారంభమవుతుంది. రేపు సాయంత్రం ప్రొద్దుటూరులో జగన్ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఉదయం స్థానిక నేతలతో సమావేశాలు.. సాయంత్రం బహిరంసభలు నిర్వహించేలా వైసీపీ నాయకత్వం ప్లాన్ చేసింది.


