ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ బిజీబిజీగా గడపనున్నారు. ఉదయం పది గంటలకు అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ హెడ్ ఆఫీసులో జరిగే పార్టీ నిర్ణయాత్మక కమిటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరుకానున్నారు. తెలంగాణ లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపైనా సాయంత్రం జరిగే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొంటారు. లోక్‌సభ అభ్యర్థులపైనా ఇప్పటికే ఏఐసీసీ స్టేట్ ఇంఛార్జ్ దీపా మున్షీతో సమావేశమయ్యారు.
తెలంగాణలోని 17 స్థానాల్లో ఫస్ట్ లిస్ట్‌లో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 13 స్థానాల్లో మెజారిటీ సీట్లపై జరిగే సీఈసీ భేటీలో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిన్న ఢిల్లీ చేరుకున్న రేవంత్.. జన్‌పథ్ 10లో ప్రియాంక గాంధీని కలిశారు. దాదాపు అరగంట పాటు జరిగిన భేటీలో వంద రోజుల పాలనపై చర్చించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలపై, నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని వివరించారు. ప్రజాపాలన, గ్యారెంటీలతో ఆడబిడ్దల రెస్పాన్స్ తెలిపారు.


