29.6 C
Hyderabad
Saturday, July 12, 2025
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

తెలంగాణలో గ్రూప్ 1,2,3 పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో గ్రూప్ 1,2,3 పరీక్షల తేదీలను TSPSC ప్రకటించింది. ఆగస్టు 7,8 తేదీల్లో గ్రూప్-2, నవంబర్ 17,18 తేదీల్లో గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జా మ్స్‌ ఉంటాయని చెప్పింది. గ్రూప్ 1లో 563, గ్రూప్ 2లో 783, గ్రూప్ 3లో 1,388 పోస్టులు ఉన్నాయి.

అంబేద్కర్ కోనసీమలో మారుతున్న రాజకీయాలు

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. అందులో భాగంగానే.. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. టీడీపీ-జనసేన పొత్తుతో సరికొత్త అభ్యర్థులు తెరపైకి వస్తు న్నారు. నిన్నటి వరకూ అభ్యర్థిగా భావించిన వారి స్థానంలో మరొకరు ప్రత్యక్షమవుతున్నారు. అధికార పార్టీలోనూ దాదాపుగా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చక్రధర్ అందిస్తారు.

ములుగు జిల్లాలో గృహజ్యోతి కార్యక్రమం ప్రారంభం

ప్రతి గ్యారంటీ పథకాన్ని తప్పనిసరిగా అమలు చేస్తామని అన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లాలో గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు జీరో బిల్ అందించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు మరో రెండు గ్యారంటీ పథకాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. గత ప్రభుత్వాలు అవలంభించిన ఆర్థిక విధానం వల్ల ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిందని …దానిని సరిచేస్తూ ఒక్కో పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి సీతక్క స్పష్టంచేశారు.

పిల్లలకు మోదీ కిట్స్‌ పంపిణీ

ప్రధాని మోదీ ఆదేశాలతో పిల్లల పౌష్టిక ఆహారం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ముషీరాబాద్‌లో హెల్తి బేబీ షో కార్యక్రమంలో భాగంగా పసి పిల్లల తల్లులకు మోదీ కిట్స్‌ను ఎంపీ లక్ష్మణ్‌తో కలిసి పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. పేద మహిళలకు ఉచిత LPG గ్యాస్ సిలిండర్, ఆయుష్మాన్ భారత్ స్కీంలో ఉచిత వైద్యం, ఉచిత టూయిలెట్ల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.

రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు నేస్తం కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సెక్రటేరియేట్‌ నుండి ప్రారంభించారు. మేడ్చల్‌ జిల్లా మూడు చింతల పల్లి రైతు నేస్తం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్‌, మేడ్చల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జ్‌ వజ్రేష్‌ యాదవ్‌, ఇతర వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. రైతు నేస్తం కార్యక్రమం రైతులకు ఎంతగానో ఉపయోగప డుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. గతంలో ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు మాత్రమే సబ్సిడీ ఇచ్చారన్నారు. ఇప్పుడు రోజువారి అవసరాలకు ఉపయోగపడే పనిముట్లు సబ్సిడీ ఇవ్వాలని ఆర్థిక శాఖ మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి చెప్పారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతిష్ట దిగజారింది – మంత్రి కోమటిరెడ్డి

   బీఆర్‌ఎస్‌ ప్రతిష్ట దిగజారిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. నిరుద్యోగులకు గ్రూప్‌ 1, డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చామ న్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు లోక్‌సభ ఎన్నికల్లో కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. రాహుల్‌ గాంధీ కుంటుంబం దేశం కోసం త్యాగాలు చేసిందని గుర్తు చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్