ఇంటర్మీడియట్ పరీక్షలపై విధించిన ఒక్క నిమిషం నిబంధన విద్యార్ధి ప్రాణాల్ని బలితీసుకుంది. నిమిషం ఆలస్యంతో పరీక్షలకు హాజరుకాలేక మనస్తాపం చెందిన శివకుమార్ అనే విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మాంగూర్ల గ్రామంలో జరిగిన ఈ విషాద ఘటన పలవు ర్ని కంటతడి పెట్టించింది. పరీక్ష రాయనందున మనోవేదనతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తండ్రికి రాసిన సూసైడ్ నోట్‌లో విద్యార్ధి పేర్కొన్నాడు. సాత్నాల ప్రాజెక్ట్ డ్యామ్ లో దూకి ఆత్మహత్య చేసుకోగా ఘట నాస్థలంలో సూసైడ్ నోట్‌తోపాటు, విద్యార్థి వాచీ, పెన్ను లభించింది. పోలీసులు విచారణ చేపట్టారు.