పవన్ కల్యాణ్‌ను చూస్తే జాలేస్తోందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తారా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ దిగజారిపోయారని.. టీడీపీ, జనసేనవి దింపుడు కళ్లెం ఆశలు అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆశించిన సీట్లు రావనే చంద్రబాబు డ్రామాలాడుతున్నారని అన్నారు. జనసేన మిగిలిన స్థానాల్లోనూ చంద్రబాబు తన అభ్యర్థులను పంపుతారని… ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేసినా తమకేం ఇబ్బంది లేదని తెలిపారు.. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీదే ఘన విజయమని స్పష్టంచేశారు..


