ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించబోతోంది. గత ప్రభుత్వం విడుదల చేసిన DSC నోటిఫికేషన్‌ను రద్దుచేస్తూ.. మరికొన్ని పోస్టుల ను కలుపుతూ కొత్త DSC నోటిఫి కేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకట్రెండు రోజుల్లో DSC నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. కొత్త నోటిఫికేషన్ ద్వారా దాదాపు 11 వేల టీచర్ పోస్టులను భర్తీచేసే అవకాశం ఉంది. ఇటీవలే గత ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దుచేసి గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా DSCని కూడా రద్దుచేసే యోచనలో రేవంత్ ప్రభుత్వం ఉంది.
గత ప్రభుత్వం 5 వేల 89 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసింది. వీటిలో SGT – 2 వేల 575 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ -1,739 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్ – 611 పోస్టులు, PET – 164 పోస్టులు ఉన్నాయి. మొత్తం లక్షా 76 వేల 530 మంది దరఖాస్తులు సమర్పించారు. వీరిలో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అత్యధికంగా 60 వేల190 దరఖాస్తులు వచ్చాయి. ఖాళీల సంఖ్యను పెంచి మెగా DSC చేప ట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి.. సుమారు మరో 5 వేల ఖాళీలను కలిపి 11 వేల పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేలోపు కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నట్లు.. అందుకు తగిన విధంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈసారి DSC నిర్వహణ సజావుగా జరిగేలా న్యాయపర సలహాలు తీసుకొని ముందుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ మయ్యే సమయానికి ఉపాధ్యాయులకు పోస్టింగులు పూర్తయితే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుం దని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో ఆలోగా ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని కాంగ్రెస్ సర్కార్ ఆదేశించి నట్టు సమాచారం.