తెలంగాణ బీజేపీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలు కిషన్ రెడ్డికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మోదీ చెప్పిన రెండు కోట్ల ఉద్యోగాలు ,15 లక్షల రూపాయలు ఏమయ్యాయి అని నిలదీశారు. కేసీఆర్ ప్యాకేజిలో భాగంగానే కిషన్ రెడ్డి అధ్యక్షు డు అయ్యాడు..ఇది బీజేపీ నేతలే చెప్తున్నారని అన్నారు. తమ ఇంఛార్జు లను విమర్శించే నైతిక హక్కు బీజేపీకి లేదని చెప్పారు. ఓటమి తర్వాత NVSS ప్రభాకర్ కు మైండ్ పాడయిందన్నారు. ఈ రోజుల్లో బెజ్ కార్లు ఓ లెక్కనా.. ఇది చాలా పెద్ద జోక్ అంటూ కొట్టిపారేశారు.


