పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ హైదరాబాద్ గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టింది. దేశంలోనే గొప్పగా గ్రామాలను తీర్చి దిద్దిన ఘనత సర్పంచ్‌లదే అని సర్పంచుల ఫోరం తెలిపింది. సీసీ రోడ్లు, రైతు వేదికలు, స్మశాన వాటికలు నిర్మించి గ్రామాలను అభివృద్ధి చేశామన్నారు. అధికారంలోకి రాగానే సర్పంచులను ఆదుకుంటామన్న కాంగ్రెస్ ప్రభుత్వం… ఇప్పుడు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండు సార్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేసామని సర్పంచ్లు తెలిపారు.


