బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి కేసులో బుక్కయ్యాడు. షణ్ముఖ్ జశ్వంత్, సోదరుడు సంపత్ వినయ్ గంజాయి కేసులో పట్టుబడ్డారు. షణ్ముఖ్ అన్నయ్య సంపత్ వినయ్ కోసం పోలీసులు ఫ్లాట్ కు వెళ్లగా.. అక్కడ జరిపిన సోదాల్లో గంజాయి లభ్యమైంది. గంజాయి సేవిస్తూ షణ్ముఖ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబ డ్డాడు. సంపత్ వినయ్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్నదమ్ములిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు . ఇందులో షణ్ముక్ పాత్రపై ఆరా తీస్తున్నారు. షణ్ముఖ్ జశ్వంత్ అన్నయ్య కొంత కాలంగా యువతితో సన్నిహితంగా ఉంటున్నారు. పెళ్లి కూడా చేసు కుంటాయని చెప్పి నమ్మంచి మోసం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో సదరు యువతీ సంపత్ వినయ్ పై పోలీసులకు పిర్యాదు చేసింది. యువతీ ఫిర్యాదు మేరకు సంపంత్ వినయ్ కోసం పోలీసులు షణ్ముఖ్ జశ్వంత్ ఫ్లాట్ కు వెళ్లగా.. అక్కడ జరిపిన తనిఖీల్లో వారికీ గంజాయి లభ్యమైంది. దీంతో అన్నదమ్ములిద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.


