కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్ లోని కిరు జలవిద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఇవ్వడంలో జరిగిన అవినీతిపై దర్యాప్తులో భాగంగా సీబీఐ దాడులు జరుపుతోంది. జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నివాసాలతో సహా 30కి పైగా కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నారు. ఢిల్లీలో ఆయన నివసిస్తున్న రెసిడెన్షియల్ సొసైటీ కాంప్లెక్స్ లోనే సీబీఐ తనిఖీలు జరుగుతున్నాయి.


