28.2 C
Hyderabad
Monday, January 26, 2026
spot_img

రసాభాసగా మారిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం

     రెండోరోజు జీహెచ్ఎంసీ  సర్వసభ్య సమావేశం రసాభసాగా జరిగింది. స్పోర్ట్స్, టాక్స్, సానిటేషన్ అండ్ టౌన్ ప్లానింగ్ పై వాడివేడి చర్చ జరిగింది. అవి ఇవి కాకుండా అన్ని శాఖల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపంచారు కార్పొరేటర్లు. దీంతో శానిటేషన్, అడ్వటైజ్మెంట్ పై హౌస్ కమిటీ వేయాలని నిర్ణయించింది కౌన్సిల్.

        తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి రెండు రోజుల పాటు సాగాయి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలు. రెండో రోజు జీహెచ్ఎంసీ  లో స్పోర్ట్స్, సానిటేషన్, ప్రాపర్టీ టాక్స్ అండ్ టౌన్ ప్లానింగ్ పై చర్చ జరిగింది. స్పోర్ట్స్ కాంప్లెక్స్ అండ్ గ్రౌండ్స్ సరిగ్గా లేవని, ఉన్నటువంటి క్రీడా ప్రాంగనాలు మెంటేనేన్స్ సరిగ్గా లేవన్నారు. కొన్ని క్రీడ ప్రాంగణంలలో కుక్కల్లు స్వైర విహారం చేస్తున్నాయని హేద్దెవా చేశారు కార్పొరేటర్లు. ఇక స్పోర్ట్స్ గ్రౌండ్స్ కోసం వందల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తున్నా ప్రయోజనం లేదని కార్పొరేటర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ అంశం వచ్చినప్పుడు అధికారుల పై మేయర్ సీరియస్ అయ్యారు. వ్యక్తి గతంగా పరిశీలన చేయాలని సూచన కమిషనర్ కు సూచించారు మేయర్. ఇండోర్ స్టేడియంలో ఇతర కార్యక్రమలు చేయడం వల్ల సమ్మర్ క్యాంప్ ల నిర్వహణ, క్రీడాకారులకు స్పోర్ట్స్ టైం ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జోనల్ అధికారులు కార్పొరేటర్ ల కు ఆన్సర్ చేయకపోవడం పై మేయర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయా అంశాల పై రివ్యూ చేయాలని కమిషనర్ కి అదేశించారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ.

      జీహెచ్ఎంసీ ఆదాయ మార్గల్లో కీలకమైన అంశం ప్రాపర్టీ టాక్స్. కానీ అధికారులు ప్రాపర్టీ టాక్స్ వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు కార్పొరేటర్లు. సైబర్ సిటీలో – సరూర్ నగర్ లో ఒకేలా టాక్స్ వసూళ్లు చేస్తే ఎలా అని ప్రశ్నించారు కార్పొరేటర్లు. ఫెక్ డాక్యుమెంట్ అనుమతులు, రాత్రికి రాత్రే వెలిసే హోటల్స్, పబ్స్ కు జీహెచ్ఎంసీ అనుమతి ఉంటున్నాయా నీలదిశారు!. రెసిడెంట్స్ పై అనుమతి తీసుకోని నాన్ రెసిడెంట్స్ కార్యక్రమాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గుర్తు చేశారు. కౌన్సిల్ హల్ లో ఓయో రూమ్స్ పై చర్చ రచ్చ రచ్చ అయింది. రెసిడెన్సీయల్ పేరుతో కమర్షల్ నడిపిస్తున్నారన్నారు. రెసిడెంట్స్ పేరుతో కమర్షల్ బిజినెస్ పేరుతో వ్యాపారం చేస్తుంటే జీహెచ్ఎంసీ  పట్టించుకోవడం లేదన్నారు. ఇక ప్రాపర్టీ టాక్స్ చర్చలో జీహెచ్ఎంసీ – బీజేపీ మధ్య వివాదం చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం పై MIM ప్రశ్నిస్తుంటే ముందు ఓల్డ్ సిటీ పెండింగ్ టాక్స్ పై కమిషనర్ ప్రకటన చేయాలనీ బీజేపీ డిమాండ్ చేసింది. ఓల్డ్ సిటీ బకాయిల పై కమిషనర్ ప్రకటన చేయాలనీ కొరింది బీజేపీ. దింతో స్పందించిన కమిషనర్ రోనాల్డ్ రోస్ ప్రాపర్టీ టాక్స్ అనేది జీహెచ్ఎంసీ కి మేజర్ ఆదాయ మార్గం అన్నారు. టాక్స్ వసూళ్లలో కొన్ని సమస్యలు ఉన్నాయి… త్వరలోనే సమీక్ష జరిపి పరిష్కార మార్గాలను వెతుకుతామన్నారు. రెసిడెంట్స్ నాన్ రెసిడెంట్స్ పై టాక్స్ వేరు వేరు రేట్లు ఉన్నాయని, రెట్ల మార్పు పై 2017లో ఒకసారి 2019లో జీవోలు విడుదల అయ్యాయని వివరించారు. టాక్స్ వసూళ్లలో చట్టం ప్రకారం వెళ్తున్నమని నిబంధనలు అతిక్రమిస్తే పెనాల్టీ వేస్తున్నామని తెలిపారు. సిటిలో సెల్లార్ లను పార్కింగ్ పై పోలీస్ – జీహెచ్ఎంసీ జాయింట్ సర్వే చేస్తామని, పార్కింగ్ కోసం ఉన్న సెల్లార్ లను ఇతర వాటికోసం వాడితే కఠినమైన చర్యలు ఉంటాయని హేచ్చరించారు.

    జీహెచ్ఎంసీ సానిటేషన్ పై వాడివేడి చర్చ జరిగింది. గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం…బిఆరెస్- కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం నడిచింది. గత రెండు నెలలుగా జీహెచ్ఎంసీ లో సానిటేషన్ సరిగ్గా లేదని బిఆరెస్ విమర్శిస్తే. గతంలో నగరమంతా చెత్త లేదా అని ప్రశ్నించారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. చెత్త సేకరణలో ప్రైవేట్ సంస్థ నిర్లక్ష్యం వహిస్తుందని, చెత్త క్లీన్ చేయాలంటే ప్రైవేట్ సంస్థలను అడుక్కోవాలా అని సభలో అసంతృప్తి వ్యక్తం చేశారు బిఆరెస్ కార్పొరేటర్లు. కార్పొరేట్ల వ్యాఖ్యల పై స్పందించిన అధికారులు సానిటేషన్ విషయంలో కొంత సమస్య ఉందని, ఒప్పంద నియమాలు కాంట్రాక్టు సంస్థ పూర్తిస్థాయిలో పాటించడం లేదన్నారు. అదే విధంగా సానిటేషన్ కార్మికుల కొరత ఉన్నట్లు ప్రకటించారు కమిషనర్. ఎక్కడైతే నిర్లక్ష్యం వహిస్తున్నారో అక్కడ నోటీసులు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇక స్విపింగ్ విషయంలో అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మేయర్ సీరియస్ అయ్యారు. శానిటేషన్ పై సైతం అవకతవకలు జరిగినట్లు పార్టీలతో సంబంధం లేకుండా కార్పొరేటర్లు ఆరోపిస్తే హౌస్ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకుంది కౌన్సిల్.మొత్తానికి రెండు రోజుల పాటు సాగినజీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీ అధికారులు వర్సెస్ కార్పొరేటర్లుగా సాగింది. అధికారుల పై చర్యలకు హౌస్ కమిటీల కోసం ఆయా పార్టీల నుంచి ఒక్కరి చొప్పున పేర్లు ఇవ్వాలని మేయర్ కోరారు. సానిటేషన్, అడ్వటైజ్మెంట్ పై హౌస్ కమిటీలు వేసి అక్రమాలను వెలికి తీయాలని నిర్ణయించింది కౌన్సిల్.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్