జగన్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రెక్కలు ఊడి పోయిన ఫ్యాన్‌ను విసిరిపారేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎక్స్ వేదికగా ఆయన మండిపడ్డారు. అభివృద్ధి పాలన ఎవరిదో.. విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దామన్నారు. దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. బాదుడు పాలనతో, విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్ ను కూల్చేసిన జగన్.. ఇప్పుడు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వానికి ఇంకా 50 రోజులే మిగిలుందన్నారు. బూటకపు ప్రసంగాలు కాదని.. అభివృద్ధిపై దమ్ముంటే తనతో చర్చకు రావాలని చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్ చేశారు.