33.9 C
Hyderabad
Thursday, March 5, 2026
spot_img

ఎలక్టోరల్‌ బాండ్లను రాజ్యాంగ వ్యతిరేకమంటూ పేర్కొన్న సుప్రీం

      లోక్‌సభ ఎన్నికల వేళ దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్దమంటూ తేల్చి చెప్పింది. వీటి ద్వారా రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛకు, అలాగే సమా చార హక్కుకు విఘాతం ఏర్పడుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతే కాదు… ఎన్నికల బాండ్ల రూపంలో ఆయా పార్టీలు అందుకున్న విరాళాలను బహిర్గతం చేయా లంటూ సీజేఐ జస్టిస్ డీ వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలో అసలు ఎన్నికల బాండ్లు అంటే ఏమిటి ? వాటి ద్వారా రాజకీయ పార్టీలకు కలిగే ప్రయోజనాలు ఎలా ఉంటాయి ? ఇలాంటి అంశాలపైనే చర్చ జరుగుతోంది,.

    సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు నిచ్చింది. ఇంకా చెప్పాలంటే ఓవైపు దేశవ్యాప్తంగా పాలిటిక్స్‌ హాట్‌హాట్‌గా సాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ తీర్పును సంచలనమనే చెప్పాలి. అవును… ఎలక్టోరల్ బాండ్లను రాజ్యాంగ వ్యతిరేకమంటూ పేర్కొంది సుప్రీంకోర్టు. ఇందుకు సంబంధించిన పథకాన్ని కొట్టి వేసింది. రాజ్యాంగం కల్పిం చిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు, సమాచార హక్కు చట్టానికి ఎలక్టోరల్ బాండ్లు వ్యతిరేకమని ప్రకటించింది సుప్రీంకోర్టు. అంతే కాదు.. ఈ పథకం కింద ఇప్పటివరకు బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లను, కొనుగోలు చేసిన బాండ్ల విలువ ను, వాటిని స్వీకరించిన వారి వివరాలను వెల్లడించాలని స్పష్టం చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం.

      ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేయాలని పేర్కొంటూ కాంగ్రెస్ నేత జయ ఠాకూర్, సీపీఎం, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ అనే స్వచ్ఛంధ సంస్థ దాఖలు చేసిన పిటీషన్లపై సుప్రీంకోర్టు గతేడాది అక్టోబరులో విచారణ మొద లు పెట్టింది. తాజాగా దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. 232 పేజీలతో కూడిన రెండు వేర్వేరు తీర్పులను ధర్మాసనం వెలువరించింది. అంతేకాదు.. ఈ మేరకు ఎలక్టోరల్ బాండ్లను విక్రయించే ఎస్‌బీఐకి కీలక ఆదేశాలు జారీ చేసింది. 2019 ఏప్రిల్ 12 నుంచి విక్రయించిన బాండ్ల వివరాలను మార్చి ఆరవ తేదీలోపుగా ఎన్నికల సంఘానికి సమర్పించాలని… సంబంధిత వివరాలను మార్చి 13లోగా ఈసీ తన వెబ్‌సైట్‌లో బహిరంగం చేయాలని ఆదేశించింది. ఇక, నగదుగా మార్చని బాండ్లను కొనుగోలు దార్ల ఖాతాల్లో తిరిగి జమ చేయాలంటూ ఎస్‌బీఐని ఆదేశించింది సుప్రీం ధర్మాసనం.

    ఈ పథకంపై తీర్పు వెలువరించే సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీం ధర్మాసనం. ఎలక్టోరల్ బాండ్ల పథకం ఏ విధంగా ప్రజల హక్కులకు భంగం కలిగిస్తుందో వెల్లడించింది. అధికారంలో ఉన్న పార్టీలు తమకు నిధులు అందించాలంటూ వ్యక్తులను, సంస్థలను బెదిరించే అవకాశం ఉందంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది సుప్రీం ధర్మాసనం. రహస్య బ్యాలెట్ మాదిరిగా విరాళం ఇచ్చిన వ్యక్తి గోప్యతను ఎలక్టోరల్ బాండ్ల పథకం కాపాడుతుందన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. అజ్ఞాత వ్యక్తుల విరాళాలకు అవకాశం కల్పించే ఎలక్టోరల్ బాండ్ల పథకం, అందు లోని నిబంధనలు ఓటరుకున్న సమాచార హక్కుకు భంగం కలిగించడమే కాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) కల్పించే భావవ్యక్తీకరణ స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నాయి అంటూ తేల్చి చెప్పింది ధర్మాసనం. తమకు వచ్చిన, రానున్న విరాళాల గురించి ఈసీకి సీల్డ్‌ కవర్‌లో రాజకీయ పార్టీలు వివరాలు సమర్పించాలంటూ 2019 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులను తాజాగా ప్రస్తావించింది ధర్మాసనం.

      నిజానికి… కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఇందుకోసం రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల వివరాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం 2017కి సవరణ చేసింది. దీంతో.. ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు. అయితే.. వాళ్లంతా విమర్శించడంలో అర్థమూ ఉంది. బయటకు కన్పించకుండా రాజకీ య పార్టీలకు విరాళాలు ఇచ్చే అవకాశం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వ్యక్తులకు, సంస్థలకు లభించింది. ఒక రకంగా చూస్తే ఇది బాండ్లు కల్పించిన హామీ లాంటిదనే చెప్పాలి. ఆ భరోసాతోనే వ్యక్తులు, సంస్థలు విరాళాలు ఇస్తూ వచ్చారు. అలాంటిది ఇప్పుడు సుప్రీంకోర్టు వారి పేర్లను బయట పెట్టాల్సిందేనని తీర్పు చెప్పడంతో రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీకి సన్నిహితంగా ఉన్నా.. మరో పార్టీకి భారీగా విరాళం ఇచ్చిన వాళ్లు ఉండొచ్చు. ఇలాంటి సమయంలో ఆయా వ్యక్తులు, సంస్థల పేర్లు బయటకు వస్తే వారికి ఇబ్బందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక, ఎలక్టోరల్ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించాయి విపక్ష పార్టీలు. కేంద్రం ఇకనైనా మోసపూరిత ఆలోచనలు మానుకోవాలంటూ సూచించింది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ. లంచాలు, కమీషన్ల కోసమే ఈ ఎన్నికల బాండ్లు తీసుకొచ్చారంటూ కేంద్రంపై ఫైరయ్యారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మొత్తంగా చూస్తే ఎన్నికల వేళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయ పార్టీలకు.. ప్రత్యేకించి ఎక్కువగా నిధులు పొందుతున్న పార్టీలకు పెద్ద షాక్‌ అనే చెప్పాలి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్