తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇవాళ బడ్జెట్‌పై చర్చ జరగనుంది. దీనిపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. ద్రవ్యవినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది. మరోవైపు… ఇవాళ సభలో కుల గణన బిల్లు పెట్టనుంది. అలాగే ఉభయ సభల్లో కాగ్ నివేదికను ప్రవేశపెట్టనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్ట్‌ను సర్కార్ సభలో పెట్టనుంది. ఇరిగేషన్, రెవిన్యూ, ఫైనాన్స్, పంచాయితీ రాజ్ నివేది కలను ప్రభుత్వం టేబుల్ చేయనుంది. ఈ సంద ర్భంగా ప్రభుత్వం అసెంబ్లీలో పలు కీలక ప్రకటనలు చేయనుంది.
లోపాలకు ఎంతమాత్రం తావివ్వకుండా పకడ్బందీగా నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా బ్యారేజీల సామర్థ్యం, ఆయా బ్యారేజీల కింద సాగు విస్తీర్ణంపా టు మేడిగడ్డ వైఫల్యానికి కారణమైన నీటి నిల్వ సామర్థ్యం ప్రధానంగా ప్రస్తావించనున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ లపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక సారాంశం కూడా శ్వేత పత్రంలో ఉండనుంది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ఉంటే కలిగే ప్రయోజనాలు, రీఇంజనీ రింగ్‌తో తెరమీదికి తెచ్చి చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కలిగిన నష్టం శ్వేతపత్రంలో ఉండనుంది. గత పదేళ్లలో ప్రాజెక్టుల నిర్మాణం ఏ ప్రయోజనాల కోసం చేపట్టారో ప్రభుత్వం స్పష్టం చేయనుంది.