జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు చేజారకుండా బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది. కార్పొరేటర్లను కాపా డుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. కాసేపట్లో తెలంగాణ భవన్‌లో జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్లతో భేటీ కానున్నారు. పార్టీకి చెందిన కార్పొరేటర్‌లందరికీ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఫోన్ చేసి కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానించడంతో ఈ భేటీకి ఆసక్తిని రేపుతోంది. కాంగ్రెస్ పెద్దలు GHMC ఆపరేషన్ బాధ్యతలను మైనంపల్లికి అప్పగించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్‌కు చెందిన మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దిన్, కాంగ్రెస్‌లో చేరారు. దీంతో అప్రమత్తమైన కేటీఆర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లతో సమావేశం కానున్నారు. దీంతో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది.