పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో.. తమ పార్టీ సభ్యులకు బీజేపీ విప్ జారీ చేసింది. పార్లమెంటులో కీలక అంశాలపై చర్చ ఉన్నందున….నేడు ఎంపీలంతా తప్పనిసరిగా ఉభయ సభలకు హాజరుకావా లంటూ మూడు లైన్ల విప్‌లో కోరింది. లోక్‌సభ, రాజ్యసభలో కొన్ని కీలక అంశాలను చర్చకు తెచ్చి, వాటిని ఆమోదిం చడం జరుగుతుందని తెలిపింది.. ఉభయసభల సభ్యులు తప్పని సరిగా హాజరై ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరుతున్నామని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు వేర్వేరుగా జారీ చేసిన విప్‌లో ఆ పార్టీ పేర్కొంది.కాగా, ఇప్పటికే సుమా రు 60 పేజీల శ్వేతపత్రాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉభయసభల్లోనూ ప్రవేశపెట్టారు. 2004 నుంచి యూపీఏ ప్రభుత్వం సంస్కరణలు గాలికి వదిలేసిందని, దేశ పటిష్ఠత కోసం గత బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం వేసిన కృషిని కొనసాగించడంలో విఫలమైందని ఆ శ్వేతపత్రంలో తప్పుపట్టింది. రక్షణరంగంలో కుంభ కోణాలు చోటుచేసు కున్నాయని, రక్షణ సన్నద్ధతపై రాజీపడ్డారని, ఆయుధాల సేకరణలో జాప్యం జరిగిం దని యూపీఏ పాలనను ఎండగట్టింది. బొగ్గు కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ పక్షపాత వైఖరితో కోల్ బ్లాక్ కేటాయింపులు జరిగాయని శ్వేతపత్రం ఆరోపించింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 9వ తేదీతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగియాల్సి ఉండగా, ఒకరోజు అదనంగా సమావేశాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ పొడిగించింది.