ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు, అంటారు పెద్దలు. ప్రతివ్యక్తి ఏదో ఒక్కరోజు సొంత ఇల్లు నిర్మాణం చేసుకొని సొంత ఇంటికళ నెరవేర్చుకోవాలి అని అప్పో,సప్పో చేసి ఇల్లు కట్టాలని కళగా ఉంటుంది. అదే సిద్దిపేటలో ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే కౌన్సిలర్ , టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుకు జంకిపోతున్నారు. ఇల్లు నిర్మాణం చేపట్టాలంటే అధికారుల కౌన్సిలర్ల చేతులు తడపాల్సిందే దీంతో మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు .
సిద్దిపేట పట్టణంలో ఎక్కడైనా కొత్తఇంటి నిర్మాణం చెయ్యాలంటే మున్సిపల్ అధికారుల నిబంధనలకు ప్రకారం సెట్ బ్యాక్ 30ఫీట్లు రోడ్ వెడల్పు ఉండేలా చూసుకొని నిర్మాణం చేసుకోవాలి. దానికి అనుగుంగానే టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతులు ఇస్తారు. కానీ కొన్నిచోట్ల మాత్రం స్థానిక కౌన్సిలర్స్ , టౌన్ ప్లానింగ్ అధికారులు మామూళ్ల మత్తులో డబ్బులు ఇస్తే ఓలెక్క, లేదంటే మరోలెక్కల నిబంధనలు ఉల్లంగిస్తున్నారు. ఏకంగా కొందరు కౌన్సిలర్స్ , అధికారులు కుమ్మకై లంచాలు తీసుకొని సెట్ బ్యాక్, బిల్డింగ్ సెల్లర్ నిర్మాణం చేసిన పట్టించుకునే నాధుడే లేడు,అప్పో చేసి ఇల్లూకట్టుకొని సొంత ఇంట్లో ఉండాలనే అనుకునే వాళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. మున్సిపల్ కార్యాలయం టౌన్ ప్లానింగ్ అధికారుల నుండి అనుమతులున్న వార్డు కౌన్సిలర్ ల ఒత్తిడితో సెట్ బ్యాక్ పేరిట కట్టిన గోడలు నేలమట్టం చేస్తున్నారు. రాఘవేంద్ర నగర్ కాలనిలో ఓపేద కుటుంబం రూపాయి, రూపాయి పొగుచేసుకొని ఇల్లు కట్టుకుంటే, మున్సిపల్ అధికారులు పట్టపగలు ఇల్లు కాంపౌండ్ వాల్ కూలగొట్టడంతో ఆ కుటుంబం బోరున ఏడిచింది. అన్ని అనుమతులున్నా, స్థానిక కౌన్సిలర్లు లక్ష రూపాయలు ఇచ్చినా గోడ కూలగొట్టారని ఆరోపించారు. అధికారులు, కౌన్సిలర్స్ తీరు బాగాలేదని ప్రజలు,ప్రతిపక్ష నాయకులు మండిపోతున్నారు.చిన్నచిన్న గల్లీలోని ఆస్పత్రులకు అనుమతులు ఇవ్వడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు.