అక్రమ కట్టడాలు కూల్చి వేసిన అధికారులు… వివరాల్లోకి కి వెళ్తే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం లో ని కన్నాల గ్రామపంచాయతీ లో జాతీయ రహదారికి ఆమడ దూరంలో అనుకొని ప్రభుత్వ భూమిని కబ్జా చేసి చుట్టూ సిమెంట్ ఫోల్స్ తో కంచె వేసి ,రూమ్ లు కూడా నిర్మించారు కబ్జా దారులు., అడ్డూ అదుపూ లేకుండా ప్రభుత్వ భూమి ని కబ్జా చేస్తున్నారు. కొంతమంది అధికారుల అండదండలతో ఇంటి నంబర్ లను తెచ్చుకొని, కరెంట్ మీటర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. కొంత మంది కాంట్రాక్టర్లులు ప్రభుత్వ భవనాలను నిర్మించే సమయంలో సామాను భద్ర పరచడానికి, కూలీలు ఉండడానికి చిన్న గదులను నిర్మించిన వాటిని కూడా కబ్జా చేస్తున్నారు. వాటిని పూర్తి స్థాయిలో నిర్మించి ఇంటి నంబర్ లు కరెంట్ మీటర్ల సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే ఎంత వరకు తెగించారో అర్దం అవుతుంది. సమాచారం తెలుసుకున్న అధికారులు, పోలీస్ సిబ్బందితో జెసిబిలతో అక్రమ కట్టడాలను కూల్చి వేయిం చారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించరాదని ,ఆక్రమిచినవారిపై కటిన చర్యలు తీసుకుంటాం అని, ప్రభుత్వ భూమిలో తాపీమేస్త్రిలు ఎలాంటి పనులు చెయ్యరాదు. ఈ ప్రాంతంలో పనులు చేసిన వారిపై కేసులు నమోదు చేసి బైండోవర్ చేస్తామని బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి హరి కృష్ణ హెచ్చరించారు..


