తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో మరో కీలక అడుగు పడ నుంది. ఆశావహుల నుంచి వచ్చిన 309 దరఖాస్తుల పరిశీలన కోసం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ప్రదేశ్ ఎన్నికల కమిటీ కాసేపట్లో భేటీ అయ్యింది. ఈ భేటీలో నియోజకవర్గానికి మూడు నుంచి ఐదు పేర్ల వరకు షార్ట్ లిస్ట్ చేయ నున్నారు. రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కలతో స్ర్కీనింగ్ కమిటీ చైర్మన్, సభ్యులు భేటీ అయ్యి అభిప్రాయాలు తీసుకోను న్నారు. ఈ భేటీల్లో తీసుకున్న అభిప్రాయాలు, పార్టీ సర్వేల ఆధారంగా నివేదికను రూపొందించనున్న స్ర్కీనింగ్ కమిటీ.. ఆ నివేదికను ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీకి సమర్పించనుంది. ఆ నివేదికల ఆధారంగా కేంద్ర ఎన్నికల కమిటీ.. అభ్యర్థులను ఖరారు చేయనుంది.