ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ నదిపై 2004లో ఆమోదించిన ఈ ప్రాజెక్టు ఇందులో 3.875 టిఎమ్సీల సామర్ధ్యంతో 80,060 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, ఒంగోలు, ఇతర గ్రామాల తాగునీటి కొరకు ఉద్దే శించబడింది. ప్రకాశం జిల్లా లోని గుండ్లకమ్మ ప్రాజెక్టును ఏపీసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆ పార్టీ సీనియర్ నేతలు రఘువీరారెడ్డి, పల్లంరాజు, రుద్రరాజుతోపాటు పలువురు నేతలు సందర్శించారు. ఈ నేపేథ్యంలో షర్మిల మీడియాతో మాట్లాడుతూ వైసీపీపై ప్రభు త్వంపై నిప్పులు చెరిగారు. దాదాపు 750 కోట్లు పెట్టి వైఎస్ఆర్ గుండ్లకమ్మ ప్రాజెక్ట్ కడితే కనీసం ప్రాపెక్ట్ మెయింటెనెన్స్ కి కోటి రూ.లు కూడా విడుదల చేయడం లేదని షర్మిల విమర్శించారు. ఈ జలాశయంప కింద సుమారు లక్ష ఎకరాల సాగునీరు అందే అవకాశం ఉంది. అలాగే పన్నెండు మండలాలకు తాగునీరు అందిస్తుందని షర్మిల అన్నారు.
గుండ్లకమ్మ ప్రాజెక్ట్ సంబంధించి 16 నెలల క్రితం ఒక గేటు , మూడు మాసాల క్రితం మరో గేటు కొట్టుకుపోయా యి అన్నారు. గుండ్లకమ్మ మెయెంటెనెన్స్ ఏ మాత్రం లేకపోవడం వలనే గేట్లు కొట్టుకు పోతున్నాయన్నారు. గత ఐదేళ్ళ గా ఎలాంటి మెయింటెనెన్స్ లేకపోవడంతో గేట్లు కొట్టు కోయాయని, వైఎస్ఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. జలయజ్ఞంలో భాగంగా గుండ్లకమ్మ ప్రాజెక్టును వైఎస్‌ఆర్ నిర్మించారు. పెద్దాయన నిర్మించిన ప్రాజెక్టుకు కనీ స మెయింటెనెన్స్ కూడా చేయలేని సీఎం వైఎస్ వారసుడు ఎలా అవుతారని జగన్ ను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యా నించారు. ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోవడం వలన దాదాపు రెండు టీఎంసీల నీరు సముద్రంలో వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ లో నీరంతా సముద్రంలో కలవడంతో నీళ్లు లేక ఆయకట్టు రైతులు ఆందోళ చెందుతున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. తన పాలనలో రాజశేఖర్ రెడ్డి ఆశాయాలు నిలబెడుతున్నానని సీఎం జగన్ అంటున్నారు. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ప్రాజెక్ట్ ను గాలికి వదిలేయడమేనా ఆశయాలను నిలబెట్టడం అంటే అని తీవ్రంగా విమ ర్శించారు.