TSPSC కొత్త చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. మహేందర్‌రెడ్డి నియామకాన్ని గవర్నర్ తమిళిసై ఆమెదించారు. ఇక, కొత్త సభ్యుల పేర్లను ప్రభుత్వం ప్రకటించనుంది. పేపర్ లీకేజీ వ్యవహారంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఎన్నో విమర్శలు మూటగట్టుకుంది. గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చినా పరీక్షలు సరిగా నిర్వహించడంలో విఫలమైందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే… అధికారంలోకి వచ్చాక టీఎస్పీ ఎస్సీని ప్రక్షాళించే పనిలో పడింది తెలంగాణ నూతన ప్రభుత్వం. ఈ క్రమంలోనే మొదటి నుంచే జాగ్రత్త వహించింది కాంగ్రెస్ సర్కారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి యూపీఎస్సీ ఛైర్మన్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు. అన్నిఅం శాలు పరిశీలించిన తర్వాత.. ఛైర్మన్‌తోపాటు సభ్యుల నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది తెలంగాణ ప్రభుత్వం. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవి కోసం 50 మంది, సభ్యుల పోస్టుకు 321 మంది దరఖాస్తు చేసుకున్నారు. చివర కు ఈ పదవికి అర్హులుగా భావించిన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ప్రభుత్వం ఎంపిక చేసింది.


