అమెరికాలో మరోసారి తుపాకీ విష సంస్కృతి జడలు విప్పింది. ఇల్లినాయిస్ రాష్ట్రంలో జోలియెట్ పట్టణంలో ఆది, సోమవారాల్లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందారు. రెండు వేర్వేరు ఇళ్లలో ముష్కరుడు కాల్పులకు తెగబడ్డాడు. నిందితుడిని రోమియో నాన్స్‌గా గుర్తించారు. మరణించిన వారితో అతడికి ముందు నుంచే పరిచయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం నుంచే ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నప్పటికీ.. ఈ విష యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ప్రస్తుతం మరణాయుధాలతో రోమియో నాన్స్ ఎరుపు రంగు టయోటా కారు లో తప్పించుకు తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. అతడి గురించి ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే వెంటనే తెలి యజేయాలని విజ్ఞప్తి చేశారు.


