29.1 C
Hyderabad
Sunday, July 13, 2025
spot_img

తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయిందా..?

         తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచు కునెలా ..ఈ నెల చివరి వారంలో కేబినెట్ విస్తరణ జరగనుంది.

    సామాజిక సమీకరణాలపై కసరత్తు చేసిన కాంగ్రెస్ అధిష్టానం సీఎం విదేశీ పర్యటన తర్వాత మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుత కేబినెట్‌లో నాలుగు ఉమ్మడి జిల్లాలకు అవకాశం కల్పించలేదు. తాజా విస్తరణలో ఆ నాలుగు జిల్లాలకు కచ్చితంగా చోటు కల్పించాల్సి ఉంటుంది. ప్రస్తుత కేబినెట్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు, వరంగల్ నుండి ఇద్దరు ,నల్లగొండ నుంచి ఇద్దరు, మహబూబ్ నగర్ నుంచి సీఎంతో కలుపుకుని ఇద్దరు, కరీంనగర్ నుంచి ఇద్దరు, మెదక్ నుంచి ఒక్కరు కేబినెట్‌లో ఉన్నారు. కులాల వారిగా చూస్తే రెడ్డి సామాజికవర్గం నుంచి నలుగురు, బీసీ నుంచి ఇద్దరు, ఎస్సీ నుంచి ఇద్దరు, కమ్మ కమ్యూనిటి నుంచి ఒక్కరు, వెలమ నుంచి ఒక్కరు, ఎస్టీ నుంచి ఒక్కరు చొప్పున కేబినెట్‌లో ఉన్నారు.

        అయితే కొద్ది రోజుల్లో జరగనున్న కేబినెట్ విస్తరణలో ఆదిలాబాద్ జిల్లా నుంచి వివేక్, ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. అయితే మాల సామాజిక వర్గ నేత కావడం , ఇప్పటికే ఆ సామాజికవర్గానికి చెందిన భట్టికి డిప్యూటీ సీఎం, గడ్డం ప్రసాద్‌కు స్పీకర్ పదవి ఇవ్వడంతో వివేక్‌కు బెర్త్ దక్కడం అనుమానమేనని పార్టీ నేతలు అంటు న్నారు. మరోవైపు ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవి ఆశిస్తున్నా ఉమ్మడి నిజామాబాద్ నుంచి మదన్ మోహన్ రావు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. అయితే ఇప్పటికే వెలమ సామాజిక వర్గం నుంచి జూపల్లి కృష్ణారావుకు మంత్రి వర్గంలో చోటు కల్పించడంతో ఈ ఇద్దరిలో ఒకరికి అవకాశం ఇస్తారో లేదో చూడాలి.

     ఇక ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే సీఎంతో పాటు ఇప్పటికే నలు గురు రెడ్డి సామాజికవర్గం నేతలు కేబినెట్‌లో ఉన్నారు. దీనికి తోడు ఉమ్మడి రంగారెడ్డి నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవికి పోటీ పడుతుండడంతో సుదర్శన్ రెడ్డికి గట్టి పోటీ తప్పేట్టు లేదు. ఉమ్మడి రంగారెడ్డి నుంచి ఒకరికి కచ్చితంగా అవకాశం కల్పించాల్సిన పరిస్థితి ఉన్నా.. ఆయనకు రెడ్డి సామాజికవర్గం ప్రతిబంధకంగా మారింది. ప్రస్తుత కేబినెట్‌లో ఇద్దరు బీసీ, ఒక ఎస్టీ నేత ఉండడంతో బీసీలోనే మరో సామాజికవర్గం నేతకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

       మరోవైపు కాంగ్రెస్ నుంచి గెలిచిన 6 మంది బీసీ ఎమ్మెల్యేలలో ఇద్దరు మంత్రులు, ఇద్దరు విప్‌లు ఉన్నారు. మరో ఇద్దరు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారు. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ సామాజికవర్గం కాగా, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ రజక సామాజికవర్గం నేత. ఈ ఇద్దరిలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఎస్టీ కోయ సామా జిక వర్గం నుంచి ఇప్పటికే సీతక్కకు అవకాశం కల్పించగా విస్తరణలో ఎస్టీ లంబాడ నుంచి మరొకరికి అవకాశం దక్క నుం ది. అందులో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్‌కు మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇక కేబినెట్‌లో మైనా రిటీలకు కచ్చితంగా అవకాశం కల్పించాల్సిన పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గాని ఎమ్మె ల్సీగా గాని ఒక్క నేత కూడా లేరు. దీంతో పలువురు మైనారిటీ నేతల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోంది. దీనికి తోడు గ్రేటర్‌ హైదరాబాద్ లో కూడా కాంగ్రెస్ కు ఎమ్మెల్యేలు లేరు. ఇక్కడ ఇతర పార్టీ ఎమ్మెల్యే లను లాగి మంత్రి పదవి ఇస్తే ఎలాంటి ఉంటుందనే దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది.

    ఇక మాదిగ సామాజికవర్గ నేతలు మరో మంత్రి పదవిని ఆశిస్తున్నారు. తద్వారా ఎస్సీ వర్గీకరణతో మాదిగ సామాజిక వర్గాన్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్న బీజేపీని కౌంటర్ చేయొచ్చని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. అలాగే గత ప్రభుత్వ కేబినెట్ లో సామాజిక న్యాయం లేదని విమర్శలు చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు తమ కేబినెట్‌లో సామాజిక న్యా యం పాటించేలా..విస్తరణ చేయాలని భావిస్తోంది. మరి ఈ సామాజిక సమీకరణాలు ఎంత మేర అమలవుతాయో చూడాలి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్