దరిగాం అటవీ ప్రాంతంలో టైగర్‌ ఆపరేషన్‌ సక్సెస్‌

       కొమురం భీం జిల్లా అడవిలో టైగర్‌ ఆపరేషన్‌ సక్సెస్‌ అయింది. ట్రాప్ కెమెరాకు పులి చిక్కడంతో సక్సెస్‎గా ముగి సింది. ఈ ఆపరేషన్‎తో దరిగాం అటవీ ప్రాంతం జీవ వైవిద్యానికి కేరాప్ అడ్రస్‎గా.. పులుల ఆవాసానికి అడ్డాగా మారిం దని తేలడంతో ఆ పరిధిలోని అటవీ సిబ్బంది బాధ్యతను రెట్టింపు చేసినట్టైంది. మూడు రోజుల పాటు కంటి మీద కునుకు లేకుండా అణువణువు గాలించిన ట్రాకింగ్ టీం టైగర్ జిందా హై అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

      ఈనెల 10 న కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం దరిగాం అటవీ ప్రాంతంలో మరో పశువుపై పులి దాడి చేయడంతో అప్రమత్తమైంది అటవీశాఖ. ఆ ప్రాంతంలో ట్రాప్ కెమెరా ఏర్పాటు చేయడంతో.. ఓ కెమెరాకు పులి చిక్కిం ది. ఆ పులి పాదముద్రల ఆధారంగా ఎస్ 6 గా గుర్తించిన అటవిశాఖ సిబ్బంది సంబరాలు చేసుకున్నారు. అడవి మొత్తం జల్లెడ పడుతోంది ఆ పులి కోసమే కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సర్చ్ ఆపరేషన్‎లో ఒక్క ఎస్ 6 మాత్రమే కాదు.. రెండు పులుల మరణాల తర్వాత కనిపించకుండా పోయిన 16 నెలలున్న మరో పిల్ల పులితో పాటు ఎస్ 6 సంతతికి చెందిన కే 14, 17 పులులు సైతం క్షేమంగా ఉండటంతో మూడు రోజుల పాటు దరిగాం అటవీ ప్రాంతంలో సాగిన సెర్చ్ ఆపరేషన్‎కు ఫలితం దక్కినట్టైంది.

Latest Articles

మల్కాజిగిరిలో దారుణం.. భార్యను రివాల్వర్‌తో కాల్చి చంపిన భర్త

హైదరాబాద్ లోని మల్కాజ్ గిరిలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో భర్త రివాల్వర్‌తో కాల్చి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. మృతురాలు నిషా రాణిగా గుర్తించారు. ఆరు నెలల కిందట నిందితుడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్